కళ్యాణ్ రామ్ సినిమా వచ్చి రెండేళ్ళు పైనే అవుతుంది. ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ బింబిసార. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో వస్తున్న ఫాంటసీ చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆగస్ట్ 5న రిలీజవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమతో.. చిత్ర యూనిట్ ఒక స్పెషల్ చిట్ చాట్‌లో పాల్గొన్నారు. లంచ్ చేస్తూ పలు అంశాల గురించి ప్రస్తావించారు. ఇందులో భాగంగానే కళ్యాణ్ రామ్ తన తండ్రి చనిపోయిన రోజున ఏం జరిగిందో గుర్తుచేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
నందమూరి హరికృష్ణ గారు చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారని కళ్యాణ్ రామ్‌ని సుమ అడుగగా ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. తన తండ్రి చనిపోయిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని కళ్యాణ్ రామ్ అన్నారు. ఉదయం 5.30 గంటల సమయంలో బాల్కనీలో కూర్చొని టీ తాగుతుండగా కాల్ వచ్చిందని అన్నారు. తన తండ్రితో కలిసి ట్రావెల్ చేస్తున్న శివాజీ రెడ్డి అనే వ్యక్తి కాల్ చేసి ఫోన్‌లో ఏడుస్తున్నాడని, తనకేమీ అర్ధం కాలేదని కళ్యాణ్ రామ్ అన్నారు.
ఏం జరిగిందో తెలుసుకుందామని శివాజీ.. శివాజీ అని పిలిచానని, కానీ అప్పటికే కాల్ కట్ అయ్యిందని అన్నారు. ఆ తర్వాత తన మావయ్యకు చెందిన ఫ్యాక్టరీ నుండి ఒక ఉద్యోగి విజయవాడకు వెళ్తూ.. కాల్ చేసి కొన్ని ఫోటోలు పంపించాడని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 2018 ఆగస్ట్ 29న హరికృష్ణ కాలం చెందారు. రీసెంట్‌గా హరికృష్ణ సోదరి, కళ్యాణ్ రామ్ మేనత్త ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని కుటుంబంలో విషాదం నింపారు. మరి తన తండ్రి మరణ వార్తను తలచుకుని భావోద్వేగానికి లోనైన కళ్యాణ్ రామ్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.