Kalyan Dev: విజేత సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు ‘కల్యాణ్ దేవ్’. 2018లో కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశారు. తీసింది కొన్ని సినిమాలే అయినా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమాకే సైమా అవార్డును గెలుచుకుంటున్నారు. సినిమాకు సినిమాకు నటనను మెరుగుపరుచుకుంటూ.. స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక, కల్యాణ్ దేవ్‌కు తల్లంటే ఎంతో ప్రేమ. తాజాగా, ఆమె పుట్టిన రోజు సందర్బంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో తల్లిని ఉద్ధేశిస్తూ.. ‘‘ పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా!.. జీవితం కొన్నిసార్లు ఎంతో కష్టతరంగా మారుతుంది.. కానీ, నీ ప్రేమ వల్ల వచ్చే శక్తితో వాటిని ఎదుర్కొంటాననే నమ్మకం నాకుంది.
నాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు థాంక్యూ.. లవ్ యూ మా ‘ అంటూ భావేద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, కల్యాణ్ దేవ్ తల్లి పుట్టిన రోజు సందర్భంగా పెట్టిన ఎమోషనల్ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Monica Dogra: నేను పాన్ సె**క్సువల్‌ను.. నా సహ నటితో ప్రేమలో పడ్డా!