సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధానపాత్రలలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట‘. ఏడాది క్రితం టైటిల్, ఫస్ట్ లుక్ లతో అంచనాలు పెంచేసిన మహేష్ బాబు.. తాజాగా సినిమాలోని ‘కళావతి‘ అనే రొమాంటిక్ లిరికల్ సాంగ్ తో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఫిబ్రవరి 14న రిలీజ్ కావాల్సిన కళావతి సాంగ్ ఓరోజు ముందే విడుదలై యూట్యూబ్ వేదికగా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
ఓవైపు లీక్ అయిందనే బాధ ఉన్నప్పటికీ, రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ రాబట్టి సర్కారు వారి టీమ్, మహేష్ అభిమానుల బాధను చెరిపేసిందనే చెప్పాలి. కళావతి లిరికల్ సాంగ్ విడుదలైన 24 గంటల్లో 16 మిలియన్ల వ్యూస్, 8 లక్షలకు పైగా లైకులు రాబట్టి మహేష్ కెరీర్ లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇక 24 గంటల్లో.. వ్యూస్ పరంగా సౌత్ ఇండియన్ మోస్ట్ వ్యూయడ్ సాంగ్, తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లైక్స్ పొందిన పాటగా కళావతి నిలవడం విశేషం.
ALL TIME RECORD 🔔💕💗💕💗💕
#SensationalKalaavathi #Kalaavathi 💃#KalaavathiMusicVideo #SVPFirstSingle #SarkaruVaariPaataMusic #SarkaaruVaariPaata pic.twitter.com/jHCGAqxSDu
— thaman S (@MusicThaman) February 14, 2022
కళావతి పాటకి వచ్చిన స్పందనతో సర్కారు టీమ్ హ్యాపీగా ఉంది. ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీస్, 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్స్ తో పాటు మహేష్ కూడా సర్కారు వారి పాట చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక విడుదలైన కళావతి సాంగ్ లో మహేష్ లుక్ మరింత యంగ్ గా ఉండటంతో మహేష్ లేడీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి కళావతి సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.