kajal aggarwal: ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మంగళవారం ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పిల్లాడికి ‘‘నీల్ కిచ్లు’’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాజల్ అభిమానులు ఆ పేరుకు అర్థం ఏంటా? అని వెతకటం మొదలుపెట్టారు. కాజల్ కుమారుడికి పెట్టిన ‘‘నీల్’’ అనే పేరు హిందీదో, సంస్కృతానిదో కాదు. అదో ఐరిష్ పదం. ‘‘NEIL’’ అన్న ఇంగ్లీష్ అక్షరాలతో ఉంటుంది. ఐరిష్‌లో ఈ ‘‘నీల్’’ అనే పదానికి ‘‘విజేత’’ అని అర్థం ఉంది. తమ కుమారుడు అన్నిట్లో విజేతగా నిలవాలన్న ఉద్ధేశ్యంతో కాజల్ దంపతులు ఆ పేరు పెట్టినట్లు ఉన్నారు.
కాగా, కాజల్, గౌతమ్ కిచ్లులు 2020, అక్టోబర్ నెలలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొన్ని నెలలు సినిమాలకు బ్రేక్ ఇచ్చారామె. ఆ తర్వాత యధావిధిగా షూటింగుల్లో పాల్గొన్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ తెరకెక్కించిన ‘‘ ఆచార్య’’ సినిమాలో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకు ముందు ఆమె దుల్కర్ సల్మాన్ సరసన ‘‘హే సినామిక’’లో నటించారు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేదు. మరి, కాజల్ అగర్వాల్ కుమారుడి పేరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మంచు విష్ణు కోసం పరోటాలు చేసిన సన్నీలియోన్! వీడియో వైరల్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.