మెగాస్టార్ చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ కీలకపాత్రలో నటించిన సినిమా ‘ఆచార్య’. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా పూజాహెగ్డే నటించింది. మెగాస్టార్ కి కూడా జోడిగా కాజల్ అగర్వాల్ ఉండాల్సింది. కానీ సినిమాలో ఆచార్య పాత్రకు కథానుసారం హీరోయిన్ ఉంటే బాగుండదని కాజల్ ని తప్పించారు మేకర్స్.
ఇక ఆచార్య ఫస్ట్ షెడ్యూల్ ముందే కాజల్ కు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ముట్టజెప్పారట నిర్మాతలు. అయితే.. షూటింగ్ లో పాల్గొన్న నాలుగు రోజులకే కాజల్ రోల్ కి సినిమాలో స్కోప్ లేదని.. ఆమెను ఒప్పించి పంపించేసినట్లు దర్శకుడు కొరటాల కూడా ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో కాజల్ సినిమాలో లేనప్పటికీ ఫుల్ రెమ్యూనరేషన్ అందుకుందని.. సినిమాకు ముందు మాట్లాడుకున్నట్లుగానే దాదాపు కోటిన్నర రెమ్యూనరేషన్ నిర్మాతలు చెల్లించారని సినీవర్గాలలో టాక్ నడుస్తుంది.
మరి ఆచార్య సినిమాకు కాజల్ తీసుకున్న రెమ్యూనరేషన్ విషయంపై మేకర్స్ ఇంకా స్పందించలేదు. కానీ కాజల్ రెమ్యూనరేషన్ పై వస్తున్న వార్తలు మాత్రం ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. కాజల్ అగర్వాల్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పేరు నీల్ అని ప్రకటించిన విషయం కూడా విదితమే. మరి ఆచార్య కోసం కాజల్ తీసుకున్న రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.