కాజోల్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అవుతోంది. ఇంతలోనే ఫ్యాన్స్‌కు చేదు వార్త అందింది. ఆమె త్వరలో సినిమాలకు దూరం కానున్నారని వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి పరిచయం అక్కర్లేదు. కాజల్ 10 ఏళ్ల క్రితం తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లై.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈ భామ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. కాజల్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ ఆమెను ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఇక, అసలు విషయానికి వస్తే.. కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారట.
ఈ మేరకు వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. కాజల్ సినిమాలకు గుడ్‌బై చెప్పటానికి ప్రధాన కారణం ఆమె కొడుకు అని తెలుస్తోంది. సినిమాల్లో బిజీ అయిపోవటం వల్ల బాబుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తోందని ఆమె భావిస్తున్నారట. బాబు ఎదుగుతున్న వేళ అతడికి తల్లి ప్రేమను అందించాలని నిర్ణయించుకున్నారట. భర్త కిచ్లూ కూడా ఇదే మాట అన్నాడట. అంతేకాదు! కాజల్ మళ్లీ గర్భందాల్చిందన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. కాజల్ సినిమాలకు దూరం అయ్యే విషయంపై త్వరలో క్లారిటీ రానుందని సమాచారం. కాగా, కాజల్ తన చిన్న నాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును ప్రేమ వివాహం చేసుకున్నారు. 2020లో వీరి పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది.
2022లో ఈ జంట ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు నేల్ కిచ్లు అని పేరు పెట్టారు. పెళ్లి తర్వాత కాజల్ కొన్ని సంవత్సరాలు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కాజల్ ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్ కాంబినేషన్ లో వస్తున్న భగవత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాతో పాటు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’.. ఉమ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. మరి, కాజల్ సినిమాలకు దూరమవ్వబోతోందన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.