టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్నారు. కాజల్ మంగళవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించిన తర్వాత.. కాజల్ తన బేబి బంప్ ఫోటో షూట్, సీమంతం ఫోటోలను షేర్ చేస్తూ.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుమారుడు నీల్‌కు స్వాగతం పలుకుతూ.. కాజల్ ఒక భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఇక పోస్ట్‌లో ఇలా ఉంది..
ఇది కూడా చదవండి: కాజల్ కొడుకు పేరును వెల్లడించిన చెల్లెలు నిషా అగర్వాల్
‘‘నా బిడ్డ నీల్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించే ఈ క్షణం నాకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. నీల్.. నిన్ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించడానికి చాలా సంతోషిస్తున్నాను. నిన్ను మొదటిసారి నా గుండెలకు హత్తుకున్న ఆ క్షణాలను నా జీవితంలో ఎన్నటికి మర్చిపోలేను. ఆ నిమిషం నేను ప్రేమ గురించి లోతైన భావాన్ని అర్థం చేసుకున్నాను. అంతేకాక జీవితాంతం నేను పూర్తి చేయాల్సిన బాధ్యతను గుర్తు చేసుకున్నాను. నిజానికి బిడ్డకు జన్మనివ్వడం అంత సులభమైన విషయం కాదు. నిన్ను నా చేతుల్లోకి తీసుకోవడానికి నేను మూడు నిద్రలేని రాత్రులు గడిపాను. విపరీతమైన రక్తస్రావం, గడ్డకట్టిన ప్యాడ్‌లు, బ్రెస్ట్ పంప్స్, ఒత్తిడి, ఆందోళనతో సతమతమయ్యాను. అయితే నిన్ను నా చేతుల్లోకి ఎప్పుడెప్పుడు తీసుకుంటానా అన్న ఆతృతతో వీటన్నింటిని ఆనందంగా అనుభవించాను’’ అంటూ రాసుకొచ్చింది.
ఇది కూడా చదవండి: హీరోయిన్ కాజల్ కొడుకు పేరుకు అర్థం తెలుసా?…‘‘నిన్ను చేతుల్లోకి తీసుకున్న తర్వాత చాలా సంతృప్తి కలిగింది. ఇప్పుడు ప్రతి రోజు మధురమైన కౌగిలింతలు, నా బిడ్డ కళ్లలోకి ప్రేమగా చూడటం, తనని హత్తుకోవడం, మేమిద్దరం ఎదుగుతూ, నేర్చుకుంటూ, ఒకరిని ఒకరం ఆవిష్కరించుకుంటూ.. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఆనందంగా, నిశబ్దంగా సాగిస్తున్నాము. బిడ్డకు జన్మనిచ్చాక ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు.. కానీ కచ్చితంగా అందంగా ఉంటారు’’ అంటుంది కాజల్. దీంతో పాటు తాను గర్భవతిగా ఉన్నప్పుడు దిగిన ఫోటోని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాజల్ చేసిన ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.