ఆమెని బిగ్ స్క్రీన్ పై చూస్తే కుర్రాళ్లంతా పిచెక్కిపోయేవారు. అందం, నటనతో ఏ విషయంలో అయినా సరే ఫిదా అయిపోయేవారు. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోలందరితోనూ దాదాపుగా సినిమాలు చేసింది. ఇక ఓ రెండేళ్ల ముందు పెళ్లి చేసుకుని అభిమానుల మనసు విరిచేసింది. సినిమాల్లో ఆమె కనిపించి రెండేళ్లవుతోంది. అయినా సరే ఏ మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. దీన్నిబట్టి మీరే అర్ధం చేసుకోవచ్చు ఆమె క్రేజ్ ఎలాంటిదో.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా లేదా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కాజల్ అగర్వాల్. హీరోయిన్ అయిన తర్వాత తెలుగు, తమిళంలో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించింది. ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. 2004లో ‘క్యూన్ హో గయా నా’ అనే హిందీ చిత్రంతో నటిగా పరిచయమైంది. అది జరిగిన మూడేళ్లకు అంటే 2007లో ‘లక్ష్మీ కల్యాణం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత చందమామ, పౌరుడు, ఆటాడిస్తా లాంటి చిన్న సినిమాలు చేసింది. ఇక ఎప్పుడైతే ఎస్ఎస్ రాజమౌళి చేతిలో పడిందో.. కాజల్ లైఫే మారిపోయింది. ‘మగధీర’లో మిత్రవింద పాత్రలో అద్భుతంగా నటించి, ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయింది.
ఇక ఆ సినిమా తర్వాత ఆర్య 2, డార్లింగ్, మిస్టర్ ఫెర్ఫెక్ట్, సింగం(హిందీ), బిజినెస్ మేన్, తుపాకీ, బాద్ షా, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, టెంపర్, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150 తదితర హిట్ సినిమాలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక 2020 అక్టోబరులో తన భాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. గతేడాది నీల్ కిచ్లూ అనే పిల్లాడికి జన్మనిచ్చింది. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయిపోయింది. మరి కాజల్ చిన్నప్పటి ఫొటోని మీలో ఎంతమంది గుర్తుపట్టారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.