డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత కృష్ణ ప్రసాద్ అరెస్ట్ అయ్యాడు. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీసులు తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ కేసులో ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. దీని ప్రకారం టాలీవుడ్ కి చెందిన ఒక ఇద్దరు హీరోయిన్లు చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తుంది.
కృష్ణ ప్రసాద్ గురించి పెద్దగా పరిచయం లేకపోయినా స్టార్ సినిమాలను డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమాలకి కూడా ఈయనే డిస్ట్రిబ్యూటర్ గా చేసాడు. పా రంజిత్ దర్శకత్వరలో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘కబాలి సినిమాకి తెలుగు వర్షన్‌కు కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. అయితే ఇతన్ని మారక ద్రవ్యాల కేసు విషయంలో అరెస్ట్ చేయడం చేయడం జరిగింది. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీసులు తెలపడం జరిగింది. అయితే ఈ డ్రగ్స్ కేసులో ఒక ఇద్దరు హీరోయిన్లు కూడా చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తుంది.
కృష్ణప్రసాద్ ను విచారించిన పోలీసులు కొన్ని కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అతని నాలుగు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ ల డేటాలను పోలీసులు తనికీ చేయగా అతనితో సన్నిహితంగా ఉంటున్న సినీ ప్రముఖుల విషయాలు బయటపడినట్టు తెలుస్తుంది. 2.75 గ్రాముల కొకైన్, కారు, రూ.2.05 లక్షల నగదు, 4 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా వారు తెలిపినట్టు సమాచారం. అయితే అతని ఫోన్ చెక్ చేయగా డేటా ప్రకారం.. ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లు కూడా ఇతని వద్ద నుండి డ్రగ్స్ పొందుతున్నట్టు తేలింది. దీంతో ఇప్పుడు మరిన్ని కఠినమైన పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. అసలే డ్రగ్స్ విషయంలో పూరి, ఛార్మి వంటి వారు ఎంతో మందికి విచారణల మీద మీద విచారణలు జరిగాయి. విజయ్ దేవరకొండ ని కూడా విచారించారు. ఇప్పుడు కృష్ణ ప్రసాద్ వలన టాలీవుడ్ పెద్దలు చిక్కుల్లో పడినట్టు అయ్యింది.