95వ అకామడమీ అవార్డ్స్ ఒరిజినల్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ నామినేట్ అయ్యింది. ఈ వార్త తెలియగానే దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు కేరింతలు కొడుతున్నారు. అంతా నాటు నాటు అంటూ డాన్సులు చేస్తున్నారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ కావడంపై దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇండియన్ సినిమాలో ముఖ్యంగా తెలుగు సినిమా చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఒకింత నిరాశతో ఉన్నారు.
నిన్నటి వరకు ఆస్కార్ బరిలో ట్రిపులార్ సినిమా రెండు కేటగిరీల్లో పోటీ పడుతుందని అంతా భావించారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ కు చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ, నామినేషన్స్ లిస్టులో మాత్రం తారక్ పేరు లోకపోవడంపై అంతా నిరాశ చెందారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు కచ్చితంగా ఉంటుందని, ఆస్కార్ కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ ప్రచారాలు జరిగాయి. కానీ, నామినేషన్స్ లో తారక్ పేరు లేకవపోడంతో తెలుగు అభిమానులు కాస్త నిరాశ చెందారు.
This year’s Original Song nominees are music to our ears. #Oscars #Oscars95 pic.twitter.com/peKQmFD9Uh
— The Academy (@TheAcademy) January 24, 2023
అయితే ఎన్టీఆర్ నామినేషన్స్ కు వెళ్తాడని కేవలం తెలుగు ప్రేక్షకులో భారతీయులో చెప్పిన మాట కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రిటీలు, పత్రికలు, మ్యాగజీన్లు ఈ విషయాన్ని ప్రస్తావించాయి. అమెరికాకు చెందిన టాప్ మ్యాగజీన్ కూడా తమ ప్రిడిక్షన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రప్రముఖంగా ప్రస్తావించింది. ఆస్కార్ అందుకోక పోయినా యాక్టర్ గా నామినేట్ అయ్యి రికార్డులు బద్దలు కొడతాడని భావించారు. కొమురం భీముడో పాటలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు ఫిదా అయిపోయారు. అదే విషయాన్ని ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కూడా.
Congratulations @MMKeeravaani Garu and @boselyricist Garu on achieving another well-deserved and monumental feat…
This song will forever hold a special place in my heart.@ssrajamouli @alwaysramcharan #RRRMovie #NaatuNaatu #Oscars95 pic.twitter.com/YYmtD0kVou
— Jr NTR (@tarak9999) January 24, 2023
ఇంక దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, నెటిజన్లు అంతా ట్రిపులార్ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ సినిమా ఇంతదూరం రావడం వెనుకున్న మాస్టర్ మైండ్ దర్శకధీరుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎంఎం కీరవాణి, చంద్రబోస్, నాటు నాటు సాంగ్ క్రూ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతా నాటు నాటు పాట ఆస్కార్స్ కి నామినేట్ అవ్వడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర సృష్టించబోతున్నామని.. ఆస్కార్ కొట్టబోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
What brilliant news!
Truly an honour to see “Naatu Naatu” nominated for the Oscars.
Another very proud moment for us & India.
Well deserved @MMKeeravaani Garu, @SSRajamouli Garu, my brother @tarak9999 and the entire team of #RRR🙏
All love ❤️— Ram Charan (@AlwaysRamCharan) January 24, 2023