తెలుగు చలనచిత్ర రంగంలో “మీ టూ” రేపిన ప్రకంపనలు అంతాఇంతా కాదు. ఆ సమయంలోనే శ్రీరెడ్డి అనే ఓ సాధారణ నటి.. స్టార్ హీరోలపై సంచలన ఆరోపణలు చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమెకి జరిగిన అన్యాయాన్ని పక్కన పెడితే.., అప్పట్లో ఆమె వ్యవహరించిన తీరు మాత్రం ఎవ్వరూ మరచిపోలేరు. ఇక ఇదే తరహాలో కొంత మంది నటీమణులు చాలా మంది సెలబ్రెటీలపై ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. ఇలాంటి వారిలో సునీత బోయ ఒకరు.
అల్లు అరవింద్ కాంపౌండ్ లో కీలక వ్యక్తిగా పని చేస్తున్న బన్నీవాసుపై ఈమె గత కొన్నేళ్లుగా సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. అవకాశాలు ఇస్తానని బన్నీవాసు తనని వాడుకున్నాడంటూ సునీత బోయ నానా రచ్చ చేస్తోంది. అయితే.., ఈమె ఒక్కసారి కూడా ఇందుకు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాలను ప్రజల ముందుకి తీసుకుని రాలేకపోయింది. ఇక ఈ విషయంలో ఇప్పటికే చాలాసార్లు జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి గొడవ కూడా చేసింది.
ఈ కారణంగానే ఈమె ఇప్పటికే రెండు సార్లు జైలుకు వెళ్లి వచ్చింది. ఈమె మానసిక పరిస్థితి బాగా లేదని మానసిక చికిత్సాలయానికి కూడా పంపించారు. ఇంత చేసినా.. సునీత బోయ బన్నీవాసుపై ఇప్పటికీ ఆరోపణలు చేస్తూనే వస్తోంది. దీంతో.. ఇప్పుడు మరోసారి సునీత బోయని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. బన్నీవాసు కార్యాలయ మేనేజర్ అయ్యప్ప పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈమెని అదుపులోకి తీసుకున్నారు. మరోసారి ఈమెని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించినట్టు తెలుస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.