తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మరో కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. గీతా ఆర్ట్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఆ కొత్త యాక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. టాలీవుడ్‌లో నట వారసులు ఎంతో మంది ఉన్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మరో కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. గీతా ఆర్ట్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఆ కొత్త యాక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. టాలీవుడ్‌లో నట వారసులు ఎంతో మంది ఉన్నారు. నందమూరి, అక్కినేని, దగ్గుబాటి, కొణిదెల కుటుంబాల నుండి వచ్చి స్టార్లుగా, పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన వారున్నారు. బాలయ్య, నాగార్జున, వెంకటేష్ తర్వాత ఆ ఫ్యామిలీలోని నెక్స్ట్ జెనరేషన్ స్టార్స్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. బ్యాగ్రౌండ్‌తో ఎంట్రీ ఈజీ అయినా.. ఎవరికి వారు ఓన్ ఐడెంటిటీతో దూసుకుపోతున్నారు. ఇక చిరంజీవి కుటుంబం నుండి వచ్చిన కథానాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ కిడ్స్ అంటే ఫ్యాన్స్, ఆడియన్స్‌లో ఉండే క్రేజ్ వేరు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోయే హీరో ఎవరో తెలుసా?
అతనికి అటు నార్నే, ఇటు నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. తనే జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్.. తారక్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడే ఈ నితిన్. నార్నే శ్రీనివాస రావు తనయుడు. నితిన్ హీరోగా పరిచయం కాబోతున్నాడని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఇప్పటికి క్లారిటీ వచ్చింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్, నితిన్ తొలి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తారక్ తమ ఫ్యామిలీలోకి వచ్చే వరకు నితిన్ వాళ్లకి ఎలాంటి సినీ నేపథ్యం లేదనే చెప్పాలి. (నితిన్ తండ్రి నార్నే శ్రీనివాస రావు, చంద్రబాబు నాయుడు రిలేటివ్స్ అమ్మాయిని వివాహం చేసుకున్నారు).
కాగా, నితిన్ తన నిర్ణయాన్ని ఫ్యామిలీ మెంబర్స్‌తో చెప్పగా.. తగిన సలహాలు, సూచనలు ఇచ్చారట. అలాగే కొద్ది కాలంగా నటనతో పాటు డ్యాన్స్ వంటి వాటిలో ట్రైనింగ్ తీసుకున్నాడట నితిన్. జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది, అల్లు అరవింద్ గీతా సంస్థతో లాంచ్ కాబోతున్నాడనే వార్త ఫిలిం వర్గాల వారిలోనూ, ప్రేక్షకాభిమానుల్లోనూ ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది. జూలై 13న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభం కానుంది. నితిన్ హీరోగా పరిచయమవనున్నాడని తెలియగానే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.