రంజాన్ మాసంలో హైదరాబాద్, చార్మినార్ వద్ద నైట్ బజార్ నడుస్తుంది. రంగురంగుల బట్టలు, గాజుల గలగలలు, రకరకాల ఆహార పదార్థాలతో పాటుగా హలీం తింటూ నైట్ బజార్‌ని ఎంజాయ్ చేస్తారు నగర వాసులు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ భార్య కూడా నైట్ బజార్‌లో సందడి చేశారు. ఆ వివరాలు..
స్టార్ హీరో భార్య అంటే ఆమె దర్జా, హోదా గురించి చెప్పాల్సిన పని లేదు. అడుగు బయటపెట్టే పని లేకుండా అన్ని కాళ్ల దగ్గరకే వచ్చేస్తాయి. బయటకు వెళ్లాలంటే కట్టుదిట్టమైన భద్రతతో.. ఎవరు గుర్తు పట్టని ప్రారంతాలకు వెళ్లి షాపింగ్ గట్రా కానిచ్చేస్తారు. అసలు వారు బయట కనిపించడమే చాలా అరుదు. అలాంటిది సామాన్యుల మాదిరి చార్మినార్ లాంటి రద్దీ ప్రాంతాలకు వస్తారా అంటే.. నో చాన్స్.. అస్సలు రారు అనే చెప్తాం. కానీ జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి మాత్రం.. అందుకు విరుద్ధం. ఆమె ఎంత సింపుల్‌గా ఉంటారో.. మరో సారి నిరూపించుకున్నారు. ఆ వివరాలు..
రంజాన్ మాసంలో.. చార్మినార్ ప్రాంతం ఎంత రద్దీగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. పండుగ దగ్గర పడుతున్న కొద్ది.. షాపింగ్‌కు వచ్చే వారి కోసం.. చాలా సేపటి వరకు షాప్‌లు ఒపెన్ చేసే ఉంచుతారు. కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా.. రంజాన్ సమయంలో చాలా మంది చార్మినార్ ప్రాంతంలో షాపింగ్ చేయాలని.. నైట్ అక్కడి అందాలను చూడాలని.. ప్రత్యేకంగా వెళ్తారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కూడా అలానే ఆలోచించారు. తాజాగా లక్ష్మి ప్రణతి.. చార్మినార్ నైట్ బజార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా షాపింగ్ కూడా చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా.. సామాన్యుల మాదిరి ప్రణతి ఒక్కరే వచ్చి.. షాపింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో కొందరు అభిమానులు.. లక్ష్మి ప్రణతి షాపింగ్ చేస్తుండగా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిన జూనియర్ ఎన్టీఆర్ భార్య అయినప్పటికీ.. లక్ష్మి ప్రణతి చాలా సింపుల్‌గా.. సామాన్యుల మాదిరి అక్కడ కలిసిపోయి.. షాపింగ్ చేయడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఆమె సింప్లిసిటీని ప్రశంసిస్తున్నారు నెటిజనులు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే వదినమ్మ.. మీరు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లక్ష్మి ప్రణతి మీడియా, సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లలోనూ పెద్దగా కనిపించరు. అలాంటిది.. ఆమె ఒక్కసారిగా ఇలా చార్మినార్ ప్రాంతంలో సందడి చేయడంతో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక టాలీవుడ్‌లో క్యూట్ కపుల్ జాబితాలో ఎన్టీఆర్-లక్ష్మి ప్రణతిలు ముందు వరుసలో ఉంటారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండే ప్రణతి చాలా అరుదుగా పోస్ట్ చేస్తారు. దాంతో అవి వెంటనే వైరల్ అవుతుంటాయి.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాట.. ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ప్రణతి, ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేశారు. ఎప్పుడు ట్రెడెషనల్ లుక్‌లో కనిపించే ప్రణతి తొలిసారి ట్రెండీ అవుట్ ఫిట్స్, స్టైలిష్ వేర్‌లో ఆకట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్-ప్రణతిల వివాహం 2011లో చాలా ఘనంగా జరిగింది. ఇండస్ట్రీలో వైభవంగా జరిగిన వివాహ వేడుకల్లో వీరిది కూడా ఒకటి. ఇక ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్న విషయం తెలిసిందే. తారక్ ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో గడుపుతుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NTR30 చిత్రంతో బిజీగా ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.