సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక తమ అభిమాన హీరో, హీరోయిన్ల విషయాలు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇక టాప్ హీరోలు, వారి ఫ్యామీలికి సంబంధించిన ఫోటోలు ఏమైనా బయటకి వచ్చాయంటే చాలు.. ఫ్యాన్స్ ఫుల్ కృషి అవుతారు. తాజాగా యంగ్ టైగర్ యన్టీఆర్ ఫ్యాన్స్ ఆ ఫీల్ ను ఎంజాయ్ చేస్తున్నారు. యన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణీతలకు సంబంధించిన పిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. యన్జీఆర్ దంపతులు ప్రస్తుతం జపాన్ టూర్ లో ఉన్నారు. వీరికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నందమూరి వారసుడిగా, సీనియర్ హీరో హరికృష్ణ తనయుడు గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన యన్టీఆర్.. తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1983 మే 20న జన్మించిన ఎన్టీఆర్ తన నటనతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన డాన్స్ తో.. ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులను అలరించిన యన్టీఆర్.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొన్నినెలల క్రితం విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో యన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అయితే ఈ సినిమా జపాన్ లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఆర్ఆర్ఆర్ అక్కడ అక్టోబర్ 21న విడుదలైంది. అయితే విడుదలకు ముందు.. మూవీ టీమ్ ప్రమోషన్ల ఫుల్ బిజీగా గడిపింది. మూవీ ప్రమోషన్ లో భాగంగా యన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలసి జపాన్ వెళ్లారు.
వారిద్దరు అక్కడ వారితో కలసి ముచ్చటించారు. జపాన్ లోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ క్రమంలో యన్టీఆర్ దంపతులకు సంబంధించిన కొన్ని ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక జపనీస్ వస్త్రాధరణలో లక్ష్మీ ప్రణతి అందరిని ఆకట్టుకుంది. యన్టీఆర్ లుక్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యన్టీఆర్ దంపతుల ఫోటోలు చూసి.. ఆయన ఫ్యాన్స్ ఫుల్ కృషి అవుతున్నారు. ‘మా అన్న వదిన’ అందర్స్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక యన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. కొరటాల డైరక్షన్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. కొన్ని కారణాలతో ఈ సినిమా షూటింగ్‌కు కాస్తా ఆలస్యం అవుతోందని అంటున్నారు. అన్ని కుదిరితే ఈ సినిమా నవంబర్ నుంచి షూట్ ఉండోచ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.