సాధారణంగా సెలబ్రిటీల గురించే కాక.. వారి కుటుంబ సభ్యుల గురించి తెలుసుకోవడానికి కూడా ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల భార్య, భర్త, వారి పిల్లల ఫోటోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. చాలా కొద్దిమంది సెలబ్రిటీల కుటుంబ సభ్యులు మాత్రమే మీడియా అటెన్షన్‌కి దూరంగా ఉంటారు. ఆ జాబితాలోకి వస్తారు జూనియర్ ఎన్టీఆర్ భార్య.. లక్ష్మి ప్రణతి. మీడియా కాదు కదా.. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కనిపించరు. జూనియర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియాలో చాలా అరుదుగా పోస్ట్ చేస్తుంటారు. అసలు లక్ష్మి ప్రణతి పేరు మీద సోషల్ మీడియా అకౌంట్‌లు ఉన్నాయా లేవా అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అంతలా ప్రైవసీ మెయిన్‌టెయిన్ చేస్తారు.
ఇక లక్ష్మి ప్రణతి బయట కనిపించడమే చాలా అరుదు.. ఒకవేళ కనిపించినా.. సంప్రదాయ దుస్తుల్లోనే ఉంటారు. ఎక్కువగా చుడిదార్, చీరల్లోనే కనిపిస్తారు. లక్ష్మి ప్రణతికి సంబంధించి కొన్ని నెలల క్రితం ఓ ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పట్టుచీర, ఒంటి నిండ ఆభరణాలు.. ముక్కుపుడకతో.. చూడగానే లక్ష్మి దేవిలా ఉంది అనిపించే లుక్‌తో అందరిని కట్టిపడేసింది. ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో తీసిన ఈ ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ ఫోటోలు చూసి ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఎప్పుడు ట్రెడిషనల్ లుక్‌లో కపినించే లక్ష్మి ప్రణతి.. లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజనులు షాకవుతున్నారు. ఆమె మేకోవర్ చూసి.. ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్-లక్ష్మి ప్రణతి.. కుమారులతో కలిసి అమెరికా టూర్‌లో ఉన్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం కుటుంబం అంతా అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో తారక్‌తో కలిసి.. రోడ్ల మీద ఎంజాయ్ చేస్తోంది. ఈక్రమంలో ఎన్టీఆర్-లక్ష్మిప్రణతికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. వీటిల్లో లక్ష్మి ప్రణతి లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఈ ఫోటోల్లో లక్ష్మి ప్రణతి.. టైట్ జీన్స్, నీ హై బూట్స్ ధరించి.. స్టైలీష్ లుక్‌లో కనిపించింది. ఈ ఫోటో చూసిన నెటిజనులు.. ట్రెడిషనల్, ట్రెండీ లుక్.. ఏదైనా మీరు మాత్రం సూపర్బ్‌గా ఉంటారు మేడం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమెరికాలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ పూర్తి కాగానే.. ఇండియా వచ్చిన తర్వాత.. దర్శకుడు కొరటాల శివ సినిమా ప్రారంభిస్తాడు తారక్. ఈ సినిమా పూర్తయిన తర్వాత.. జూనియర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.
NTR @tarak9999 on Instagram – Enjoying a New York minute ❤🔥#NTR #JrNTR #LakshmiPranathi pic.twitter.com/UWEE9HLUyV
— SumanTV (@SumanTvOfficial) December 27, 2022