సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా మల్టీస్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. ఇదివరకు తమ సినిమాలను ఇతర హీరోలకు పోటీగా రిలీజ్ చేసిన హీరోలు ఇప్పుడు అదే హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేసేందుకు సై అంటున్నారు. భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తే ఆ కిక్కే వేరంటున్నారు ఫ్యాన్స్. అయితే.. సినిమాలో ఇద్దరూ స్టార్స్ హీరోలే కావాల్సిన అవసరం లేదు. ఒకరు విలన్ గా కనిపించినా ఆదరించేందుకు ప్రేక్షకులు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటున్నారు.
తెలుగు ఫస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా ‘RRR’. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. మార్చి 25న రిలీజ్ కానున్న ఈ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే చిత్రబృందం RRR సినిమా ప్రమోషన్స్ ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎలాగో రాంచరణ్ తో మల్టీస్టారర్ చేసేశారు కదా.. ఇంకా ఇండస్ట్రీలో ఏయే హీరోలతో మల్టీస్టారర్ చేయాలనుంది? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ సరప్రైజ్ ఆన్సర్ ఇచ్చాడు.ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘నాకు బాలా బాబాయ్(బాలకృష్ణ), చిరంజీవి గారు, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ లతో మల్టీస్టారర్ మూవీస్ చేయాలని ఉంది’ అని ప్రెస్ మీట్ లో చెప్పినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ మాటలు ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ అనిపిస్తుండగా.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ లాంటి ఒక సూపర్ స్టార్.. ఇతర హీరోలతో మల్టీస్టారర్ చేయాలనుంది అని చెప్పడం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. మరి ఫ్యూచర్ లో ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరిన్ని మల్టీస్టారర్స్ వస్తాయేమో చూడాలి. ఇక ఎన్టీఆర్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.