జూనియర్ ఎన్టీఆర్, యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల మధ్య మంచి స్నేహం ఉంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఎన్టీఆర్, సుమను ఆటపట్టిస్తుంటాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా.. కీరవాణితో ఇంటర్వ్యూ సందర్భంగా జూనియర్.. సుమను ఉద్దేశించి రాకాసి, నోరేసుకుని పడి పోతుంది అని కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో సుమ ముందు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు ఎన్టీఆర్. సుమ మీద ఎప్పుడు జోక్‌గా పంచులు వేస్తుండే జూనియర్ తాజాగా ఓ సందర్భంలో.. సీరియస్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా అయితే ప్రకటించారు.. కానీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు.. రిలీజ్ డేట్, ఇతర నటీనటులు ఎవరు అనే అంశాలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. సందర్భం దొరికిన ప్రతిసారి దీని గురించి ఎన్టీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సుమ కూడా ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా అప్డేట్ గురించి గుర్తు చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశాడు. సుమ వైపు ఓ సీరియస్ లుక్ ఇచ్చాడు.
తాజాగా తన అన్న కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్రం బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు అక్కడ కూడా ఎన్టీఆర్కొ-రటాల శివ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. ఎన్టీఆర్‌ను మాట్లాడమని కోరుతూ.. సుమ కూడా కొరటాల శివ సినిమా విషయాన్ని ప్రస్తావించింది. అయితే సుమ మాటలు విన్న ఎన్టీఆర్ ఈ విషయంలో సీరియస్ అయ్యాడు, ఆమె వైపు చాలా కోపంగా చూస్తూ సీరియస్ లుక్ ఇచ్చాడు.
ఎన్టీఆర్‌ని అలా చూసిన కళ్యాణ్‌రామ్.. తమ్ముడుని కూల్ చేసే ప్రయత్నం చేశారు. దాంతో స్థిమితపడిన ఎన్టీఆర్.. అభిమానులు అడగకపోయినా మీరు చెప్పించేసేలాగా ఉన్నారూ అంటూ సుమకు కౌంటర్ వేసి తర్వాత అభిమానులను అభ్యర్థించాడు. ఎన్టీఆర్ 30 అప్డేట్ అనే కాదు ఏ హీరో సినిమా అప్డేట్ అయినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా తామే బయట పెడతాం అని.. తమ భార్యల కన్నా ముందు ఫ్యాన్స్‌ఏ చెబుతాం అని తెలిపారు. మేం కావాలని అప్డేట్ విషయాన్ని దాచుకున్నట్లు మీరు దాని గురించి పదే పదే ప్రశ్నిస్తే.. దర్శక నిర్మాతల మీద ప్రెజర్ పడుతుంది. దయచేసి ఈ విషయంలో అర్థం చేసుకోండి అని కోరాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.