యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు ఎన్టీఆర్ అంటే.. టాలీవుడ్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో పాన్ ఇండియా మాస్ రివేంజ్ డ్రామా ఒకటి అనౌన్స్ చేసి నందమూరి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. అదేవిధంగా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మాఫియా యాక్షన్ మూవీ అనౌన్స్ చేసి మరో సర్ప్రైజ్ అందించాడు.
ఈ క్రమంలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా నందమూరి అభిమానులు.. ఎన్టీఆర్ పుట్టినరోజును గ్రాండ్ గానే సెలబ్రేట్ చేశారు. అయితే.. ఎన్టీఆర్ ని కలిసి విష్ చేయడానికి ఇంటికి వెళ్లిన ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. బర్త్ డే విషెస్ చెప్పేందుకు ఎన్టీఆర్ ఇంటికి ఫ్యాన్స్ వెళ్లగా.. అక్కడ ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. తాజాగా తనను ఇంటి వద్ద కలిసి విష్ చేయడానికి ఎక్కడెక్కడి నుండో వచ్చిన అభిమానులకు క్షమాపణ చెబుతూ ఎన్టీఆర్ ఓ ఎమోషనల్ లేఖను పోస్ట్ చేశాడు.
‘‘నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, తోటి నటీనటులు అందరకీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. నన్ను విష్ చేసేందుకు ఎక్కడెక్కడి నుండో ఫ్యాన్స్ మా ఇంటికి చేరుకున్నారు. ఫ్యాన్స్ చూపించే ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ ప్రేమ, అభిమానం, ఆశీస్సుల ముందు ఏదీ ఎక్కువ కాదు. నేను ఇంట్లో లేకపోవడం వల్ల ఎవరినీ కలవలేకపోయాను. అందుకు నన్ను క్షమించాలి’’ అని తారక్ లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ లెటర్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఎన్టీఆర్ లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Thank you. pic.twitter.com/cDpTnBHeoR
— Jr NTR (@tarak9999) May 20, 2022