ఈ ఏడాది మొదటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్‘. పీరియాడిక్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆర్ఆర్ఆర్.. ఓటిటి వేదికలపై కూడా అద్భుతమైన ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించిన ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లు వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.
ఇక బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ తర్వాత రాజమౌళి నుండి వచ్చిన ఈ చిత్రం.. ఇండియన్ ఫ్యాన్స్ తో పాటు విదేశీ ప్రేక్షకులను సైతం విశేషంగా అలరించింది. అదీగాక 2022 ఆస్కార్ బరిలో కూడా ఆర్ఆర్ఆర్ పలు విభాగాలలో పోటీ చేస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా.. ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పుడు జపాన్ లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అక్టోబర్ 21న జపాన్ లాంగ్వేజ్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కాబోతుండగా.. జపాన్ లో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు పయనమయ్యారు చిత్రదర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్. ప్రస్తుతం వీరు జపాన్ కి వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ తో పాటు ఆయన సతీమణి ఉపాసన కూడా వెళ్లడం సర్ప్రైజ్ కాగా.. దర్శకుడు రాజమౌళి కూడా చరణ్, ఉపాసనలతోనే ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు ఎన్టీఆర్ కూడా జపాన్ కి పయనమయ్యాడు. ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో కనిపించిన ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. సాధారణంగా జపాన్ సినిమాలు తెలుగులోకి డబ్ అవుతుండటం చూస్తుంటాం. కానీ.. మొదటిసారి ఒక తెలుగు సినిమాను జపాన్ వాళ్ళు ఏరికోరి డబ్ చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా తెలుగు ఖ్యాతి మరింత ఎత్తుకు ఎదిగిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ జపాన్ వెర్షన్ ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. చూడాలి మరి జపాన్ లో తెలుగు సినిమా సత్తా ఎంతవరకు ప్రూవ్ అవుతుందో!
Mana young tiger 💥 #jrntr in style off to Japan for #RRRMovie promotions#RRRInJapan @ArtistryBuzz @tarak9999 pic.twitter.com/tHHDSbzHgI
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2022
Ram Charan Landed in Japan 🔥#RRRinJapan#RamCharan #RRRMovie#ManOfMassesRamCharanpic.twitter.com/vZRuYuRLke
— Self Made (@Self_Mde) October 18, 2022
Eyy Mana #AbhayRam😎& #BhargavaRam🥰with @tarak9999😍
On the way to JAPAN for #RRRmovie promotions#RRRInJapan✨pic.twitter.com/xzgee9qEz9
— BhargavaRam Fc (@BhargavaRamFc) October 18, 2022