కొద్దికాలంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా సినిమాల ఒరవడి ఊపందుకుంది. ప్రతి స్టార్ హీరో నుండి పాన్ ఇండియా సినిమాలను కోరుకుంటున్నారు ప్రేక్షకులు. అందుకు తగ్గట్టుగానే పాన్ ఇండియా స్థాయిలోనే సినిమాలు లైనప్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ‘NTR30’ ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్.. త్వరలో ప్రారంభం కాబోతుంది. అలాగే దర్శకుడు కొరటాల కూడా అనిరుధ్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నాడు.
ఈ క్రమంలో ఎన్టీఆర్30కి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు కొరటాల. ఎన్టీఆర్ లుక్ సినిమాలో ఎలా ఉండబోతుందో రివీల్ చేశాడు. అనౌన్స్ మెంట్ వీడియోలో ఎన్టీఆర్ చేతిలో కత్తి.. రక్తపాతం చూపించిన కొరటాల.. ఈసారి బ్లాక్ సూట్ లో ఇంటెలిజెన్సీతో కూడిన క్లాస్ లుక్ చూపించాడు. హీరోలను క్లాస్ గా, స్టైలిష్ గా చూపించడం అనేది కొరటాలకు కొత్తకాదు. ఇదివరకే ఎన్టీఆర్ తో ‘జనతాగ్యారేజ్’ మూవీ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే.. ఈ రెండో సినిమాను యాక్షన్ డ్రామా నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నాడట. తన ప్రతి సినిమాలో ఏదొక సోషల్ ఎలిమెంట్ ని హైలైట్ చేసే కొరటాల.. ఈ సినిమాలో కూడా ఓ యూనివర్సల్ పాయింట్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. కొరటాల రిలీజ్ చేసిన ఎన్టీఆర్ కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది. ఇంటెన్స్ గెటప్ లో ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ ఇంటెన్స్ లుక్ లోనే కనిపిస్తుంటాడు. మరోవైపు ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ చేయనున్నాడా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే అనౌన్స్ మెంట్ వీడియోలో ఊరమాస్ లుక్ చూపించిన కొరటాల.. ఇప్పుడు క్లాస్ లుక్ లో ప్రెజెంట్ చేసేసరికి.. రెండు రోల్స్ ఉన్నాయా లేక రెండు వేరియేషన్స్ ఉన్నాయా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక షూట్ ఎప్పుడు? ఇతర నటీనటులు ఎవరు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
#NTR30 🔥
War is not Only Solution…Powerful Thoughts Decides War Results💥💥💥
Ready to Witness Mass Euphoria 🥳@tarak9999 @NTRArtsOfficial pic.twitter.com/ftee7tVg36
— Yuvasudha Arts (@YuvasudhArts) November 22, 2022