ఎన్టీఆర్ ని ఫ్యాన్స్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పుకుంటారు. ఎందుకంటే పెళ్ళి తర్వాత తారక్ అంత పరిణతి చెందారు. కేరెక్టర్ పరంగా, కెరీర్ పరంగా ఎన్టీఆర్ తన పరిపక్వతను చూపిస్తూ వచ్చారు. దీనికి కారణం తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి అని అందరికీ తెలిసిందే. తన తల్లి తర్వాత తనని అంతగా ప్రభావితం చేసిన మహిళోత్తమురాలు లక్ష్మీ ప్రణతి అని తారక్ చెబుతుంటారు. తారక్ ని కంప్లీట్ గా ఛేంజ్ చేయడంతో వదినమ్మ పాత్ర ఉందని అభిమానులు ఫీలవుతుంటారు. నిజమే పెళ్లికి ముందు చూసిన తారక్ వేరే, పెళ్ళి తర్వాత చూస్తున్న తారక్ వేరే.
లక్ష్మీ ప్రణతి తనను ఎప్పుడూ గైడ్ చేస్తుందని, ఆమె నా కోసం చాలా చేసిందని, అందుకే తనకు అంత ప్రాధాన్యత ఇస్తానని తారక్ అంటూ ఉంటారు. అందుకే తన కోసం ఇంట్లో గడిపేందుకు సమయం కేటాయిస్తానని అంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీ విషయానికొచ్చేసరికి ప్రత్యేక సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో పూర్తిగా భార్యా, పిల్లలకే తన సమయాన్ని అంకితమిస్తారు.
మరి ఇంత ప్రాధాన్యత ఇచ్చే తారక్, సతీమణి బర్త్ డే వస్తే వెలకట్టలేని ప్రేమని చూపించకుండా ఉంటారా? ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి పుట్టినరోజుకి ఆరున్నర ఎకరాల ఫామ్ హౌస్ ని బహుమతిగా ఇచ్చారు. ఈ ఫామ్ హౌస్ కు బృందావనం అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. పేరుకి తగ్గట్టే చుట్టూ చెట్లతో పచ్చగా కళకళలాడుతూ ఉంటుందట ఆ ఫామ్ హౌస్. కుటుంబ సభ్యులతో, క్లోజ్ ఫ్రెండ్స్ తో సరదాగా గడిపేందుకు.. పార్టీలు, సెలబ్రేషన్లు చేసుకునేందుకు ఈ ఫామ్ హౌస్ ని వినియోగిస్తున్నారట.
గత ఏడాది రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన గోపాలపురం గ్రామ పరిధిలో ఎన్టీఆర్.. ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ సమయంలో రిజిస్ట్రేషన్ పనుల కోసం శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ లో ఎన్టీఆర్ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ వ్యవసాయ భూమిలోనే ఎన్టీఆర్ ఫామ్ హౌస్ ని నిర్మించారట. ఆ ఫామ్ హౌస్ నే తన భార్య లక్ష్మీ ప్రణతికి బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చారు.
ఇక ఈ పేరు చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘బృందావనం’ పేరునే ఈ ఫేమ్ హౌస్ కి పెట్టడంపై తారక్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి తన సతీమణికి ‘బృందావనం’ను బహుకరించిన తారక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Noel Sean: సింగర్ నోయల్ ఇంట తీవ్ర విషాదం!
ఇది కూడా చదవండి: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం.. ఆరోజు నుంచి షూటింగ్స్ బంద్!