యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి మనకు తెలిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. అందుకు తగ్గట్లుగానే హీరోలు, డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే పనుల్లో బిజీ అయిపోయారు. ఇప్పటికే సౌత్ ఇండియా సినిమాలు అయిన బాహుబలి-1,2, పుష్ప, కేజీఎఫ్ -1, 2, RRR లాంటి మరికొన్ని మూవీలు పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. దాంతో అటు మేకర్స్ తో పాటుగా ఇటు హీరోలు సైతం అలాంటి కథలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ లో స్టార్ హీరోగా దూసుకెళ్తున్నాడు. ఇక RRRలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. వారితో పాటుగా హాలీవుడ్ రచయితలు కూడా యంగ్ టైగర్ నటనపై ప్రశంసలు కురింపించారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో NTR30 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ముగిసిన అనంతరం.. యంగ్ టైగర్ కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ చిత్రానికి కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే?
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కోసం యంగ్ టైగర్ ఏకంగా 3 సంవత్సరాలు తన డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా.. ఈ మూవీని రెండు భాగాలుగా తీయ్యనున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోలను ఎలివేట్ చెయ్యడంలో ప్రశాంత్ నీల్ సిద్దహస్తుడు అని అతడి గత సినిమాలు చూస్తేనే అర్థం అవుతుంది. దాంతో ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటి నుంచి తారక్ ను ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడో అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ప్రభాస్ అనారోగ్య కారణాల కారణంగా కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడింది అంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. మరి ప్రశాంత్ నీల్ ను నమ్మి యంగ్ టైగర్ ఎన్టీఆర్ 3 సంవత్సరాల డేట్స్ ఇచ్చాడు అన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#JrNtr #NTR30 #NTR31 #PrashantNeel pic.twitter.com/WyWsJjuQKk
— Skyups Media (@skyupsMedia) February 14, 2023