సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో.. ఎప్పటికప్పుడు తమ సినిమాల విషయాలను, పర్సనల్ విషయాలను పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ కి దగ్గరవుతుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలకు సంబంధించి ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో చాలా ఆసక్తి కనబరుస్తుంటారు ఫ్యాన్స్, నెటిజన్స్. జనరల్ గా స్టార్ హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే మిలియన్స్ లో ఉంటుందనే సంగతి తెలిసిందే. ఒక్కో టైంలో.. ఒక్కో హీరో మిలియన్స్ మార్క్ ని రీచ్ అవుతుంటారు.
తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ఫాలోయింగ్ లో సరికొత్త రికార్డు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ట్విట్టర్ వేదికగా 6 మిలియన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ మార్క్ అందుకొని టాప్ లిస్టులో చేరాడు. 2021 డిసెంబర్ వరకు 4.1 మిలియన్స్ ఫాలోయర్స్ ఉండగా.. కేవలం ఆరు నెలల్లోనే.. అంటే 2022 జూన్ వరకు అమాంతం 1.9 మిలియన్ ఫాలోయింగ్ పెరగడం హాట్ టాపిక్ గా మారింది. అదీగాక 2022 మోస్ట్ పాపులర్ తెలుగు ఫిలిం స్టార్ గా కూడా ఎన్టీఆర్ నిలిచిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఇక ఓవరాల్ ట్విట్టర్ ఫాలోయింగ్ పరంగా ఎన్టీఆర్ కంటే ముందు మహేష్ బాబు, అల్లు అర్జున్, నాగార్జున, రానా నిలిచారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 6 మిలియన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోల లిస్టులో చేరడంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. 6 నెలల్లో 19 లక్షల ఫాలోయర్స్ ని సంపాదించుకోవడం అనేది అందరు హీరోలకు సాధ్యం కాదు. మరి ఈ విషయంలో ఎన్టీఆర్ నిజంగానే స్టార్ అనిపించాడని సినీవర్గాలు చెబుతున్నాయి.
6M followers for @tarak9999 Anna ❤🐯#ManOfMassesNTR #NTR31 pic.twitter.com/RVhGRwUcuj
— 🐅 (@krish_Tarak_) June 4, 2022
ఇక కెరీర్ పరంగా చూసినట్లయితే.. ఈ ఏడాది ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లు కలెక్షన్స్ రాబట్టి రికార్డు సెట్ చేసింది. అదేవిధంగా ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ మోస్టర్ పోస్టర్ రిలీజ్ చేయగా మంచి హైప్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కనున్నాయి. మరి ఎన్టీఆర్ ట్విట్టర్ ఫాలోయింగ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Man of Masses NTR’s Official Twitter Handle Reached 6 Million Followers Milestone Mark !! 👑❤️🔥#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/xMwcDqhLns
— Jr NTR Music (@TheNTRMusic) June 3, 2022
My next with Koratala Siva… https://t.co/iPyKSQ9Sjs pic.twitter.com/xaEB1ZbwON
— Jr NTR (@tarak9999) May 19, 2022