JR NTR: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం మొత్తం చాటిచెప్పారు దర్శకుడు రాజమౌళి. ఇద్దరు స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన కల్పిత కథను సినిమాగా తెరకెక్కించి అందరినీ మెప్పించారు. ఈ సినిమాలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్‌ల నటనకు ప్రపంచం మొత్తం ఫిదా అయింది. అయితే, సినిమా విడుదలైన కొత్తలో పాత్రల నిడివి, ప్రాధాన్యత విషయంలో జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. తమ హీరోకంటే రామ్ చరణ్‌కు ఎలివేషన్స్ ఎక్కువగా ఉన్నాయని, నిడివి కూడా చరణ్ పాత్రకే ఎక్కువగా ఉందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ జక్కన్నపై మండిపడ్డారు.
దీనిపై విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఇదంతా నిన్నటివరకు.. నేటి పరిస్థితి పూర్తిగా మారింది. ఎన్టీఆర్ పాత్ర విషయంలో ఆయన అభిమానులు జక్కన్నను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. జూ.ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల బరిలో ఉత్తమ నటుడిగా రేసులో ఉన్నాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వెరైటీ అనే హాలీవుడ్ మూవీ మ్యాగజైన్ దీనిపై ఓ పోస్టర్ విడుదల చేసింది. ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఉత్తమ నటుడిగా పాజిబుల్ కంటెండర్స్ లిస్టులో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు గానూ జూ.ఎన్టీఆర్ ఉన్నాడని పేర్కొంది. ఇక, తమ హీరో ఆస్కార్ అవార్డుల లిస్టులో హాలీవుడ్ హీరోలతో పోటీ పడుతున్నాడంటూ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్‌లో జూ.ఎన్టీఆర్‌కు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇచ్చి, ఆస్కార్ అవార్డుల వేటలో నిలబెట్టారంటూ జక్కన్నను ప్రశంసిస్తున్నారు. తమ హీరోకు అకాడమీ అవార్డు వచ్చినట్లుగానే భావించి, వార్తను వైరల్ చేస్తున్నారు. అయితే, జూ. ఎన్టీఆర్ అభిమానులు ఓ విషయాన్ని మర్చిపోతున్నారు. ఆస్కార్‌కు ఉత్తమ నటుడిగా పోటీకి ఎంపిక అవ్వటం అన్నది సాధారణంగా జరిగేదే. మన దేశం నుంచి ఇప్పటి వరకు చాలా మంది అలా పోటీలో నిలిచారు. కానీ, ఫైనల్‌కు వెళ్లలేకపోయారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. సదరు మ్యాగజైన్ పాజిబుల్ కంటెండర్స్ అంటూ ఊహను వెల్లడించింది . ఆ ఊహలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు. మరి, ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nayan- Vignesh: సెకండ్ హనీమూన్ కోసం స్పెయిన్ వెళ్లిన నయనతార- విఘ్నేశ్ దంపతులు!