'NTR30'.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే ఫ్యాన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ నుండి ఇంకా కొత్తగా, గొప్ప సినిమాలను కోరుకుంటారు ఫ్యాన్స్. కానీ.. ఊహించని పరిణామాల వల్ల ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్30 ప్రారంభోత్సవం వాయిదా పడింది.
కొద్దిరోజులుగా నందమూరి ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘NTR30’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. వీరి కాంబోలో ఆల్రెడీ జనతా గ్యారేజ్ వచ్చి సక్సెస్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్30పై ఫ్యాన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ నుండి ఇంకా కొత్తగా, గొప్ప సినిమాలను కోరుకుంటారు ఫ్యాన్స్. ఆ విషయం దృష్టిలో పెట్టుకొనే ఎన్టీఆర్ కూడా.. ఆలస్యం అయినా పరవాలేదని కొరటాలతో స్క్రిప్ట్ ని పకడ్బందీగా సిద్ధం చేయిస్తున్నాడు.
ఎన్టీఆర్30తో ఈసారి పాన్ ఇండియా స్థాయిలో పూర్తిగా సాలిడ్ స్టెప్ వేయాలని ఎన్టీఆర్ – కొరటాల ఆలోచిస్తున్నారు. అందుకే సినిమా కోసం పాన్ ఇండియా ఫేమ్ ఉన్న టెక్నీషియన్స్ ని లైనప్ చేశారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. అయితే.. 2018లో అరవింద సమేత హిట్ తర్వాత.. 2022లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యింది. రెండు సినిమాలకే ఇంత గ్యాప్ వచ్చిందంటే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వచ్చి ఏడాది అవుతున్నా ఇంకా కొరటాల సినిమా మొదలు కాలేదు. ఇప్పటికే మొదలు పెట్టాల్సిన ఈ సినిమాని.. ఆచార్య ప్లాప్ కారణంగా స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు చేశారు కొరటాల.
ఈ క్రమంలో సినిమా ప్రారంభం అవ్వాల్సిన ప్రతీసారి ఏవో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. కాగా.. ఇవన్నీ కాదని ఫిబ్రవరి 24న ఎన్టీఆర్30 పూజా ముహూర్తం అనౌన్స్ చేశారు. కానీ.. దురదృష్టవశాత్తు నందమూరి ఫ్యామిలీలో తారకరత్న ఒక్కసారిగా అనారోగ్యానికి గురవ్వడం.. 23 రోజులు ఆస్పత్రిలో పోరాడి కన్నుమూయడంతో విషాదం నెలకొంది. దీంతో ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్30 ప్రారంభోత్సవం వాయిదా పడింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ అంతా మళ్లీ నిరాశ చెందారు. కానీ.. ఫ్యామిలీలో మనిషి దూరమైతే ఎవరైనా ఏమి చేయలేరు. సో.. ఈసారి సినిమా పూజ వాయిదా పడటానికి ఎన్టీఆర్, కొరటాల మాత్రం రీజన్స్ కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఇంకొద్ది రోజులు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సి ఉంది. లేట్ గా వచ్చినా.. ఖచ్చితంగా ఫ్యాన్స్ ని మెప్పించే తీరుతుందని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్30 నుండి మరో అప్ డేట్ వచ్చేదాకా ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే. మరి ఎన్టీఆర్30 కోసం మీ అంచనాలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలియజేయండి.
#NTR30 #NBK108 pic.twitter.com/ntH9E0Y9d8
— Aakashavaani (@TheAakashavaani) February 20, 2023