టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి ‘RRR’ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో అభిమానులు చేసే రచ్చ మాములుగా లేదు. ఇప్పటికే RRR సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కొత్త రికార్డులు సెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సతీమణి ప్రణతి.. పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ వీడియోలో ఎన్టీఆర్ పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ లు చాలా హుషారుగా కనిపిస్తున్నారు. తల్లితో పాటు శ్రీవారి దేవస్థాన దర్శనం చేసుకొని సందడి చేశారు. అయితే.. అభయ్, అభిరామ్ ఇద్దరూ కూడా అల్లరి చేస్తారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీడియోలో అల్లరి చేసిన అభయ్, భార్గవ్ లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియో చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా మల్టీస్టారర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇక మార్చి 25న RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మరి RRR సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.