RRR సినిమా భారీ విజయం సాధించింది. కలెక్షన్ల వసూళ్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక రాజమౌళి-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో చిత్రం RRR. గతంలో సింహాద్రి, స్టూడెంట్ నం.1, యమదొంగ ఆ తర్వాత RRR. అయితే జక్కన్నతో చేసిన తర్వాత.. ఆ హీరోకు తప్పకుండా ఫ్లాప్ సినిమాలు వస్తాయనే ఓ టాక్ ఇండస్ట్రీలో ఉంది. చాలా మంది హీరోల విషయంలో ఇదే జరిగింది. ఎందుకంటే జక్కన్న సినిమా తర్వాత ఆ హీరోల మీద ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు పెరుగుతాయి. వాటిని రీచ్ కాకపోతే కష్టం. జూనియర్ విషయంలో కూడా ఇదే జరిగింది. సింహాద్రి సినిమా తరువాత జూనియర్ కెరీర్‌లో వరుస ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. దీనిపై గతంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: RRR కథ మొదలయ్యేది ‘మల్లి’ పాత్రతో.. మరి తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా!
యమదొంగ సినిమా సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో ఇది. తారక్ మాట్లాడుతూ.. ఈరోజు ఈ స్థాయికి ఎదిగి ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నాను అంటే అది స్టూడెంట్ నంబర్ 1 సినిమా పెట్టిన భిక్షే అని అన్నారు. ఆ తర్వాత ఆది, సింహాద్రి సినిమాలతో తనకు విజయాలు దక్కాయని తెలిపారు. అయితే సింహాద్రి సినిమా తన కెరీర్‌ను ఎంతపైకి తీసుకెళ్లిందో అంతే కిందికి తోసేసిందని తారక్ అన్నారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు తాను నిరుత్సాహపడటంతో పాటు ఫ్యాన్స్ ను కూడా నిరుత్సాహపరిచానని తారక్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఫ్యాన్స్ గొడవపై గరికపాటి చురకలు.. ఎన్టీఆర్ ఇబ్బంది పడుతున్నాడంటూ కామెంట్స్!
ఆ సమయంలో తన కెరీర్ అయిపోయిందంటూ కామెంట్స్ వచ్చాయని.. ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా మాట్లాడతారని అప్పుడే తనకు బాగా అర్థం అయ్యిందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఫ్లాప్స్ లో ఉన్న తనకు చిన్న వెలుగు రాఖీ అని ఆ తర్వాత యమగోల సినిమాను మళ్లీ చేస్తున్నామని జక్కన్న తనతో చెప్పి యమదొంగ చేశారని తారక్ వెల్లడించారు. రాజమౌళి సూచనల మేరకు 4 నెలల్లో బరువు తగ్గానని తారక్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.