మన దేశంలో రాజకీయాలకు, సినిమాలకు విడదీయరాని అనుబంధం ఉంది. నాటి ఎన్టీఆర్, ఎంజీఆర్ నుంచి నేటి తరం హీరోల వరకు చాలా మంది రాజకీయాలో రాణిస్తున్నారు. ఇక నందమూరి కుటుంబం నుంచి ఈ రాజకీయ వారసత్వం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే బాలకృష్ణ రాజకీయాల్లో రాణిస్తుండగా.. Jr NTR కూడా రాజకీయాల్లోకి రావాలని టీడీపీ శ్రేణలతో పాటు, ఆయన అభిమానులు కూడా ఆశిస్తుంటారు. సందర్భం చిక్కిన ప్రతి సారి తారక్ పొలిటికల్ ఎంట్రీ టాపిక్ తెర మీదకు వస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో మరో సారి జూనియర్ రాజకీయ ప్రవేశం గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: సింహాద్రి సినిమా నా కెరీర్‌ను నాశనం చేసింది: Jr Ntr
RRR సినిమా భారీ విజయంతో చిత్ర బృందం ఫుల్ జోష్‌లో ఉంది. సక్సెస్ మీట్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. సినిమా విజయం సాధించిన తర్వాత తారక్ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పొలిటికల్ ఎంట్రీ సహా పలు అంశాల గురించి క్లారిటీ ఇచ్చాడు.
ఇది కూడా చదవండి: RRRపై కేఏ పాల్ సెటైర్స్. .నీ మొహం రా అంటూ వర్మ కౌంటర్!తనకు స్పూర్తి తాత గారే అని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. 300 సినిమాలకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పుపొందిన గొప్పనటుడు, ముఖ్యమంత్రిగా ప్రజా మన్ననలు పొందిన రాజకీయవేత్త నందమూరి తారక రామారావు గారు అంటూ ప్రశంసించారు. బాధ్యతాయుతమైన దేశ పౌరుడు ఎన్టీఆర్ అని, భారతీయ పౌరుడిగా ఎంత బాధ్యతతో ఉండాలో ఆయనే అందరికీ నేర్పారని తెలిపారు. ‘‘ఈ దేశ పౌరుడిగా మనం పొందిన ప్రేమను ఇతరులకు కూడా పంచాలి. అభిమానులకు ఆ ప్రేమను ఎలా పంచాలనేదే నా ప్రధాన లక్ష్యం. వెలకట్టలేని ప్రేమ, ఆదరణ చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఏదో ఒక రోజు వారికి తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంది’’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
ఇది కూడా చదవండి: RRR ఆఫర్.. రాజమౌళికి నో చెప్పిన హీరోయిన్స్ వీళ్లే!
పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నించగా.. ఫ్యాన్స్ అందరినీ తృప్తి పరచడానికి మంచి సినిమాల్లో నటించడం, మంచి పాత్రలు పోషించడంపైనే దృష్టి పెట్టాను. సమయం వచ్చినప్పడు తాత గారి అడుగు జాడల్లో నడుస్తా అని ఎన్టీఆర్ చెప్పారు. ప్రస్తుతం నటుడిగా ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నానని, ఇప్పటివరకైతే తన ఫోకస్ అంతా నటనపైనే ఉందని ఆయన తెలిపారు. దీంతో మరోసారి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. తారక్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
. @tarak9999 about political entry pic.twitter.com/ZESf7YZxzw
— ʀᴇᴛɪʀᴇᴅ ғᴀɴᵀʰᵒᵏᵏᵘᵏᵘⁿᵗᵘᵖᵒᵛᵃᵃˡᵉ (@Mass_kantri) March 31, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.