యన్టీఆర్.. తెలుగు చలనచిత్ర రంగంలో ఈ పేరుకి ఉండే స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ పెద్దాయన మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నటుడు జూనియర్ యన్టీఆర్. తాతకి తగ్గ మనవడు అనిపించుకోవడంలో జూనియర్ సూపర్ సక్సెస్ అయ్యాడు. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, యాక్టింగ్ ఇలా అన్నిట్లోనూ ఈ నందమూరి హీరోకి ఎదురులేదు. ఇక ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న తారక్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ మూవీలో నటిస్తున్నాడు. కాగా., ఈ గురువారం యన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆర్.ఆర్.ఆర్ టీమ్ తారక్ ఫ్యాన్స్ కి ఓ చిరు కానుక అందించింది. జూనియర్ ఎన్టీఆర్ హై వోల్టేజ్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో తారక్ చేతిలో బల్లెం పట్టుకొని కనువిందు చేశాడు. ఈ పోస్టర్ చూసిన వారు తెలుగు తలైవా బాక్సాఫీస్ కటౌట్ అదిరింది అంటూ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది ఎలాగైతే జాగ్రత్తలు చెప్పాడో ఈసారి కూడా అలానే తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోసం ఓ లెటర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే జూనియర్ ఫ్యాన్స్ యన్టీఆర్ పుట్టినరోజు నాడు ఎలాంటి హంగామా చేయకుండా సైలెంట్ అయిపోయారు. కానీ.., ఈ పోస్టర్ అద్భుతంగా ఉండటం మాత్రం వాళ్ళకి కాస్త సంతోషాన్ని పంచుతుంది.
తారక్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ అదిరిపోయింది. ట్రిపుల్ ఆర్ పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా.., యన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంగా లేరా అంటే అవుననే సమాధానం వినిస్తోంది. యన్టీఆర్ పుట్టినరోజు నాడు మూవీ యూనిట్ నుండి టాకీతో కూడిన ఓ అద్భుతమైన టీజర్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశ పడ్డారు. కానీ.., రాజమౌళి ఈసారి కూడా ఓ చిన్న పోస్టర్ తో సరిపెట్టడం తారక్ ఫ్యాన్స్ ని నిరాశ పరిచిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దాదాపు రెండేళ్లు కేటాయించారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కారణంగా 2019, 2020 కాలెండర్ ఇయర్‌లో ఎన్టీఆర్ సినిమా అనేదే థియేటర్‌లోకి రాలేదు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2021లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనపడటం లేదు. కెరీర్ మొదలుపెట్టి నప్పటి నుంచి వరుసగా మూడు కాలెండర్ ఇయర్స్‌లో ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోవడం ఇదే మొదటిసారి. ఇలాంటి సమయంలో కనీసం అప్డేట్స్ అయినా సరిగ్గా ప్లాన్ చేసుకోవచ్చు కదా అన్నది అభిమానుల నుండి వినిపిస్తున్న ప్రశ్న. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.