టాలీవుడ్ బిజీస్ట్ బ్యాచిలర్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. మొదటినుండి సినిమా సినిమాకి డిఫరెంట్ సబ్జెక్టులతో ఆడియెన్స్ ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఫలక్ నుమా దాస్ లో మాస్ క్యారెక్టర్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశ్వక్.. ఈసారి 'దాస్ కా ధమ్కీ' అంటూ రెడీ అయిపోయాడు. హీరోగా నటిస్తూనే.. దర్శకత్వం వహించి సినిమాని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు.
టాలీవుడ్ బిజీస్ట్ బ్యాచిలర్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఈ నగరానికి ఏమైంది. ఫలక్ నుమా దాస్, పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరిదేవుడా.. ఇలా సినిమా సినిమాకి డిఫరెంట్ సబ్జెక్టులతో ఆడియెన్స్ ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఫలక్ నుమా దాస్ లో మాస్ క్యారెక్టర్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశ్వక్.. ఈసారి ‘దాస్ కా ధమ్కీ’ అంటూ రెడీ అయిపోయాడు. హీరోగా నటిస్తూనే.. దర్శకత్వం వహించి సినిమాని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. కారణాలు తెలియదు గాని.. మార్చి 22న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. టాలీవుడ్ లో విశ్వక్ సేన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే వీరాభిమానం అనే సంగతి తెలిసిందే. గతంలో చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరేట్ యాక్టర్ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ని చూడబోతున్నాడట మాస్ కా దాస్. తాజా సమాచారం ప్రకారం.. ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ రాబోతున్నాడని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించినప్పటికీ.. విశ్వక్ ఆల్రెడీ ఎన్టీఆర్ తో ప్రీ రిలీజ్ విషయంలో సంప్రదింపులు జరిపాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సో.. దాస్ కా ధమ్కీని ఎంకరేజ్ చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ రానున్నాడని.. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే విశ్వక్ సేన్.. డ్రీమ్ కం ట్రూ అయినట్లే అని చెప్పుకోవచ్చు. మరి ఫ్యాన్ బాయ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి.. విశ్వక్ ని ఎన్టీఆర్ సర్ప్రైజ్ చేస్తాడేమో చూడాలి. ఇదిలా ఉండగా.. ధమ్కీ సినిమాలో విశ్వక్ సరసన నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా.. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లేని ప్రముఖ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ సంయుక్తంగా ఈ దాస్ కా దాస్ సినిమాని నిర్మించాయి. మరి ధమ్కీ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Jr. NTR will grace the pre-release event of the film Dhamki starring Vishwak Sen and Nivetha Pethuraj✨#vishwaksen #jrntr #nivethapethuraj #daskadhamki #telugucinema #telugumovie #coffeeinachaicup pic.twitter.com/FjT2Xmqp8f
— Coffee in a Chai Cup (@coffeeinachaic1) February 27, 2023