ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో మెరుస్తుంటారు సినీతారలు. ఇండస్ట్రీలో ఇదంతా మామూలే. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరూ కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారు. వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. తదుపరి కొరటాల శివతో పాన్ ఇండియా మూవీకి రెడీ అవుతున్నాడు. ఇటీవల సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ చేయడంలో కూడా దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్.
సినీతారలు ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో మెరుస్తుంటారు. ఇండస్ట్రీలో ఇదంతా మామూలే. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరూ కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారు. వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. తదుపరి కొరటాల శివతో పాన్ ఇండియా మూవీకి రెడీ అవుతున్నాడు. అయితే.. సినిమాలతో పాటు ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ కూడా కమర్షియల్ యాడ్స్ చేయడంలో దూసుకుపోతున్నాడు. ఆల్రెడీ ఎన్టీఆర్ ఫాంటా, లిషియస్ బ్రాండ్స్ కి ప్రమోటర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్రాండ్ కి ప్రమోటర్ గా మారిపోయాడు.
ఫాంటా అనేది కూల్ డ్రింక్, లిషియస్ అనేది ఫిష్ సేల్స్ సర్వీస్.. తాజాగా మరో డ్రింక్ కే బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు ఎన్టీఆర్. యాపిల్ ఫిజా బ్రాండ్ ప్రవేశపెడుతున్న కొత్త రకం పానీయానికి.. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కృతి సనన్ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. వీరిద్దరికి సంబంధించి కమర్షియల్ యాడ్.. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్, కృతి సనన్ ఇద్దరూ.. యాడ్ లో సూట్స్ తో మెరిసిపోతున్నారు. పైగా చాలా స్టైలిష్ గా వీరి జంట ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. అయితే.. ఎన్టీఆర్ – కృతి కాంబినేషన్ లో సినిమా రాకపోయినా.. కనీసం యాడ్ అయినా వచ్చిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ – కృతి ప్రమోట్ చేస్తున్న న్యూ ఫిజా యాడ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.