ప్రముఖ హాలీవుడ్ హీరో, హీరోయిన్లు, మాజీ భార్యాభర్తలు జానీ డెప్, అంబర్ హెర్డ్‌లు ప్రేమగా కలుసున్న రోజులకంటే.. విడిపోయి గొడవపడ్డ రోజులే ఎక్కువ. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట రెండేళ్లు మాత్రమే కలిసున్నారు. అప్పుడు కూడా ఏదో ఒక వివాదంతోనే రోజులు గడిపారు. 2015లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2017లో విడాకులు తీసుకుంది. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికి వీరి మధ్య గొడవలు ఆగలేదు. 2018 డిసెంబర్‌లో అంబర్ తనను తాను ‘‘ గృహహింసకు బలైన ఓ పబ్లిక్ ఫిగర్’’గా పేర్కొనటంతో మరోసారి గొడవ మొదలైంది. మాజీ భార్య మాటలతో ఆగ్రహించిన జానీడెప్ అంబర్‌పై పరువు నష్టం దావా వేశాడు. అంబర్ తనను గృహ హింసకు పాల్పడిన వ్యక్తిగా చిత్రీకరించింది అంటూ కోర్టును ఆశ్రయించాడు. ఇందుకు పరిహారంగా తనకు 389 కోట్ల రూపాయలు చెల్లించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఈ కేసులో జానీ డెప్ విజయం సాధించారు. ఈ మేరకు వర్జీనియా ఫెయిర్ఫాక్స్లోని జ్యూరీ బుధవారం జానీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వేధింపులకు గురైనట్లు హెర్డ్ కల్పిత ఆరోపణలు చేసిందన్న డెప్ వాదనను కోర్టు సమర్థించింది. తనను తాను గృహహింస బాధితురాలిగా చిత్రీకరించుకుంటూ 2018లో ‘ది వాషింగ్టన్ పోస్ట్’ కోసం రాసిన వ్యాసం ఆధారంగా హెర్డ్‌పై రూ.389 కోట్ల (50 మి.డాలర్లు) పరువు నష్టం దావా వేశాడు డెప్. దీనిని సవాలు చేస్తూ తమ 15 నెలల వివాహబంధంలో తాను గృహహింసను ఎదుర్కొన్నట్లు హెర్డ్ రూ.776కోట్ల (100మి.డాలర్లు) పరువు నష్టం దావా వేసింది.
ఇది కూడా చదవండి: Amber Heard: హీరో జానీ డెప్ దారుణాల గురించి బయటపెట్టిన మాజీ భార్య!
ఈ కేసు విచారణ జూన్ 1న పూర్తయ్యింది. ఈ సందర్భంగా డెప్‌కు రూ.116 కోట్ల (15మి.డాలర్లు) పరిహారం చెల్లించాలని జ్యూరీ తీర్పుచెప్పింది. అయితే హెర్డ్ కూడా పాక్షికంగా తన పరువునష్టం కేసు గెలిచింది. హెర్డ్ చేసిన ఆరోపణలు కుట్రపూరితమని డెప్ తరఫు మాజీ న్యాయవాది వ్యాఖ్యానించారు. పరిహారం కింద ఆమెకు రూ.15.5కోట్లు (2 మి.డాలర్లు) చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది.
అంబర్ హెర్డ్ నిరాశ..
అదే సమయంలో, కోర్టు తీర్పుపై అంబర్ హెర్డ్ నిరాశ వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం మహిళలకు ఎదురుదెబ్బ లాంటిదని అన్నారు. హెర్డ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కోర్టు నిర్ణయంపై తన స్పందనను తెలిపారు. ‘‘ఈ రోజు నాకు బాధగా ఉంది. నేను మాటలలో వర్ణించలేను’’ అని రాశారు.
జానీ డెప్ స్పందన ఇది..
కోర్టు తీర్పు పట్ల ‘జాక్ స్పారో’ జానీ భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు అనుకూలంగా రావడంతో.. జానీ డెప్ సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితాన్ని తనకు తిరిగి ఇచ్చారంటూ జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడాయన.
ఇది కూడా చదవండి: Amber Heard: జానీ డెప్‌ని చూసి భయపడ్డ మాజీ భార్య.. అంత సీను లేదంటున్న నెటిజన్లు..
డెప్, హెర్డ్ 2011లో ‘ది రమ్ డైరీ’ అనే సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. అలా జానీ డెప్, అంబర్ హెర్డ్‌లు 2015లో వివాహం చేసుకున్నారు. మే 2016లో హర్డ్.. డెప్ గృహ హింసకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆ తర్వాత ఈ జంట 2017లో విడాకులు తీసుకున్నారు. డెప్ బలవంతంగా సెక్స్, మాదకద్రవ్యాల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు చేశారు.. హెర్డ్. నేడు కోర్టు తీర్పు అతనికి అనుకూలంగా రావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Ali: F3 సినిమా సక్సెస్ మీట్‌లో ఆలీ షాకింగ్ కామెంట్స్! ఇదంతా వాళ్లే చేస్తున్నారంటూ!