ఒక నిర్మాత తనను రూమ్‌కు రమ్మన్నాడని ప్రముఖ నటి ఆరోపించింది. రెండుసార్లు తనను రూమ్‌కు రమ్మన్నాడని ఆమె చెప్పింది. గదిలో ఆయన మాటలు విని తాను షాక్ అయ్యానని చెప్పింది.
‘మీ టూ’ ఉద్యమం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ ఉద్యమ సెగలు చిత్ర పరిశ్రమను కూడా తాకాయి. ఫలానా దర్శకుడు, ఫలానా హీరో తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ కొందరు ఫిమేల్ స్టార్స్ బయటపెట్టారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి అంతా సర్దుకున్నట్లే కనిపించింది. కానీ అప్పుడప్పుడూ సినీ సెలబ్రిటీలపై ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వీటిలో నిజానిజాలు ఏంటనేది పక్కనబెడితే.. ఇలాంటి వాటి వల్ల వార్తల్లో సెలబ్రిటీల పేర్లు కొన్ని రోజులు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఒక నిర్మాత తనను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది ప్రముఖ నటి జెన్నిఫర్ మిస్త్రీ. నిర్మాత అసిత్ మోడీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తెలిపింది. ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ అనే పాపులర్ సిట్ కామ్‌లో జెన్నిఫర్ మిస్త్రీ యాక్ట్ చేసింది.
ఈ షో షూటింగ్ సమయంలో నిర్మాత అసిత్ తనను లైంగికంగా వేధించాడని జెన్నిఫర్ పేర్కొంది. ఆయన వేధింపులు తట్టుకోలేక ఆ షో నుంచి తాను తప్పుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయంపై తాను మౌనంగా ఉండాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. ‘2019లో ‘తారక్ మెహతా’ షో టీమ్ మొత్తం కలసి సింగపూర్‌కు వెళ్లాం. అక్కడ పరిస్థితులు మారిపోయాయి. మీకు నైట్ పార్ట్నర్ లేకపోతే నా రూమ్‌కు వచ్చి విస్కీ తాగమన్నారు అసిత్. అలా రెండుసార్లు తన రూమ్‌కు నన్ను పిలిచారు. మరో సందర్భంలో నేను చాలా అందంగా ఉన్నానని.. నన్ను ముద్దుపెట్టుకోవాలని ఉందన్నారాయన. అసిత్ వ్యాఖ్యలతో నేను షాకయ్యా’ అని జెన్నిఫర్ మిస్త్రీ చెప్పుకొచ్చింది. అసిత్ ఆఫర్‌ను తిరస్కరించడంతో సిట్ కామ్‌లో తన సీన్స్‌ను తొలగించారని ఆమె పేర్కొంది. పేమెంట్ విషయంలో బెదిరించారని తెలిపింది. జెన్నిఫర్ ఆరోపణలపై ఇప్పటివరకు అసిత్ మోడీ స్పందించలేదు. దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Jennifer Mistry Bansiwal Call Recording
Over she’s sexxually assault by director pic.twitter.com/YUmPpMnQKK— Ghar Ke Kalesh (@gharkekalesh) May 12, 2023