సీనియర్ సినీ నటి జీవిత రాజశేఖర్ పై నగరి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జీవిత, రాజశేఖర్ దంపతులు గరుడవేగ సినిమా కోసం తమ నుండి రూ. 26 కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టారని ఆ సినిమా నిర్మాణ సంస్థ, నిర్మాతలు జోష్టర్ ఫిలిం సర్వీసెస్ యాజమాన్యం చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా జీవిత రాజశేఖర్ తమపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ కి గురయ్యే సెలబ్రిటీ ఫ్యామిలీస్ లో జీవిత రాజశేఖర్ ఫ్యామిలీ ఒకటి. ఇండస్ట్రీలో ఏ ఇష్యూ జరిగినా మమ్మల్ని మధ్యలోకి లాగుతుంటారని జీవిత ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే కథనాలు, థంబ్ నెయిల్స్ చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయని ఆమె వాపోయారు. శేఖర్ మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్న జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. “మేం ఎలాంటి తప్పులు చేయలేదు. తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం మాకుంది. తప్పు లేదంటే దేవుడితోనైనా పోరాడే శక్తి ఉంది. ఎవరు తప్పు చేశారనేది కోర్టు తెలుపుతుంది” అని చెప్పింది.
అదేవిధంగా మీడియా, సోషల్ మీడియాలో తమ ఫ్యామిలీ మీద వచ్చే కథనాలు, థంబ్ నెయిల్స్ పై స్పందించి ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో ఏం జరిగినా కూడా జీవిత రాజశేఖర్‌లపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. ముఖ్యంగా మా అమ్మాయిల గురించి పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెడుతుంటారు. ఇటీవల మా ఇద్దరి కూతుళ్లపై కూడా అలాంటివే రాశారు. రాజశేఖర్ కూతురు లేచిపోయిందంటూ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కథనాలు రాశారు. ఆ వార్తలు చూసి ఎంతోమంది మాకు ఫోన్ చేశారు. ఎంతో బాధేసింది.
మా ఆయనకు బాలేదని మా కూతుళ్లు తిరుమలకు వెళ్లి మెట్లెక్కారు. అలంటి సమయంలో ఎవరికి తోచినట్లుగా వాళ్ళు పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెట్టేసి న్యూస్ రాశారు. వాళ్ళేదో చదువుకుంటూ యాక్టింగ్ అంటే ఇంటరెస్ట్ ఉండి.. వచ్చిన అవకాశాలతో సినిమాలు చేసుకుంటున్నారు. ఎందుకని అలాంటి థంబ్ నెయిల్స్ పెడతారు. లోపల ఏం రాశారో ఎవ్వరూ చూడరు. థంబ్ నెయిల్స్ మాత్రమే చూస్తారుని.. కాబట్టి మాకు కూడా ఫ్యామిలీ ఉంది. అర్థం చేసుకోవాలంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం జీవిత మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి జీవిత మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.