తెలుగు ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన జేడీ చక్రవర్తి తర్వాత మని, గులాబీ, వన్ బై టూ లాంటి చిత్రాలతో హీరోగా మారారు. దర్శకుడిగా, హీరో, విలన్ గా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు.
తెలుగు ఇండస్ట్రీలో విలన్ గా కెరీర్ మొదలు పెట్టి తర్వాత హీరోలుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో జేడీ చక్రవర్తి ఒకరు. 1989లో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ చిత్రంతో విలన్ గా నటించిన జేడీ చక్రవర్తి తర్వాత హీరోగా మారారు. వన్ బై టూ, మనీ మనీ, గులాబీ మరికొన్ని హర్రర్ జోన్ లో వచ్చిన చిత్రాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా విజయాలు అందుకున్నాడు. కొంతకాలంగా మళ్లీ ప్రతినాయకుడి పాత్రల్లో నటించాడు. తాజాగా జేడీ చక్రవర్తి కి అరుదైన గుర్తింపు లభించింది. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన జేడీ చక్రవర్తి హీరోగానే కాకుండా దర్శకుడు, విలన్ గా అన్ని రంగాల్లో తనదైన మార్క్ చాటుకున్నాడు జేడీ చక్రవర్తి. ఇటీవల తెలుగు చిత్రాలకు, నటీనటులకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తున్న విషయం తెలిసిందే. దేశ విదేశాల్లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో మన చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించింది. తాజాగా సీనియర్ నటుడు జేడీ చక్రవర్తికి అరుదైన గుర్తింపు లభించింది. నైజీరియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జేడీ చక్రవర్తికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిలో ‘దహిణి-ది విచ్’ అనే మూవీకి ఉత్తమ సహాయనటుడిగా ఈ అరుదైన గౌరవం లభించింది.
ఇక చిత్ర విషయానికి వస్తే.. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టర్ రివర్ దర్శకత్వంలో వచ్చిన ‘దహిణి: ది విచ్’ మూవీలో తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి, శ్రుతి జయన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి రవి పున్నం మాటలు అందించారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వేదికలపై ఈ సినిమా పలు అవార్డులను రాబట్టుకుంది. ఆస్ట్రేలియాలో జరిగిన టైటాన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ గా ‘దహిణి-ది విచ్’ అవార్డు సొంతం చేసుకుంది. ఈ మూవీ ఇప్పటి వరకు 18 అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.
దహిణి-ది విచ్ మూవీ వాస్తవిక ఘటనల ఆధారంగా రాజేష్ టర్ రివర్ తెరకెక్కించారు. విచ్ హంటింగ్ పేరుతో పలురాష్ట్రాల్లో జరుగుతున్న దారుణాలను వెలుగు లోకి తీసుకు వచ్చే ప్రయతమే దహిణి-ది విచ్ మూవీ ముఖ్య ఉద్దేశం. ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసన ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా దహిణి-ది విచ్ మూవీని రూపొందించారు. ఎంతోమంది మహిళలను మంత్రగత్తెలు అన్న అనుమానంతో దారుణంగా చంపేశారు. ఇలాంటి దారుణాలపై ప్రశ్నించే మూవీనే ‘దహిణి – ది విచ్’ చిత్రం. ఈ చిత్రంపై పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ మూవీలో జేడీ చక్రవర్తి ఇప్పటి వరకు ఎప్పుడూ చేయనటువంటి ఓ వైవిద్యమైన పాత్రలో అద్భుతంగా నటించారు.ఈ మూవీలో అంతర్జాతీయ అవార్డు విన్నర్ తనిష్ట చటర్జీతో పాటు బద్రుల్ ఇస్లామ్, అంగనా రాయ్, అషికి హుస్సేన్, రిజ్జూ బజాజ్ తదితరులు నటించారు. అంతర్జాతీయ స్థాయిలో జేడీ చక్రవర్తి కి ఈ గుర్తింపు రావడంతో సహ నటులు, అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.