ఇప్పటి సినిమాల్లో హీరోయిన్లు బికినీలు ధరించడం అనేది సర్వసాధారణంగా మారింది. ఆ లెక్కకొస్తే మూవీస్‌లోనే కాదు.. బయట వెకేషన్‌కు వెళ్లినప్పుడు బీచ్‌ల్లో బికినీలు వేసుకొని దిగిన ఫొటోలను హీరోయిన్లు షేర్ చేయడం కామన్ అనే చెప్పాలి. అయితే ఆ రోజుల్లోనే ఒక స్టార్ కథానాయిక బికినీ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
సినిమాల్లో ఈమధ్య గ్లామర్ డోస్ ఎక్కువవుతోంది. చిన్న హీరోయిన్ల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు అందరూ అందాల ప్రదర్శనకు అంతగా అడ్డు చెప్పట్లేదు. పాత్ర అవసరాన్ని బట్టి పొట్టి బట్టల్లో కనిపిస్తున్నారు. ఇంకా అవసరమైతే బికినీలు కూడా ధరించేస్తున్నారు. ఇక హాలీవుడ్ మూవీస్‌లో అయితే ఆ హద్దులు కూడా ఉండవు. దుస్తులు లేకుండా కూడా నటిస్తుంటారు నటీమణులు. కానీ ఇండియన్ సినిమాలు కాస్త నయమనే చెప్పాలి. అయితే ఇక్కడ ఇప్పుడు బికినీలు కామన్ అయిపోయాయి. ఇలా బోల్డ్ క్యారెక్టర్లలో నటించే వారికి ఛాన్సులు కూడా బాగానే వస్తున్నాయి. వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. అయితే భారతీయ చిత్రాల్లో ఈ బికినీ వేసుకోవడం అనేది కొత్తేమీ కాదు. తెలుగు సినిమాల్లోనైతే 1970ల్లోనే ఒక స్టార్ హీరోయిన్ ఆడియెన్స్‌కు బికినీ ట్రీట్ ఇచ్చారు.
ఆమె మరెవరో కాదు.. జయసుధ. పదమూడేళ్ల వయసులోనే చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు జయసుధ. సహజ నటనతో ఆడియెన్స్‌లో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1972వ సంవత్సరంలో వచ్చిన ‘పండంటి కాపురం’ చిత్రంతో పరిచయం అయ్యారు జయసుధ. అనతి కాలంలోనే తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఒక సినిమాలో బికినీలో కనిపించారు. అప్పటి జయసుధ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటి హీరోయిన్ల కంటే అప్పట్లోనే జయసుధ ఇలా చేశారంటే.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ రోజుల్లోనే బికినీ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన జయసుధ.. ఇప్పుడు ఎక్కువగా మదర్ క్యారెక్టర్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన ‘వారసుడు’ మూవీలో దళపతి విజయ్‌కు ఆమె తల్లిగా నటించి మెప్పించారు.