‘Jayam’ Child Artist Yamini Swetha: సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఒకే ఒక్క సినిమాలో కనిపించి.. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆర్టిస్టులలో ఒకరు యామిని శ్వేత. జయం సినిమాలో హీరోయిన్ సదా చెల్లి పాత్రలో కనిపించిన యామిని.. ఆ సినిమా తర్వాత ఏ సినిమాలోనూ మళ్లీ కనిపించలేదు. అదీగాక జయం సినిమాకే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా అందుకోవడం విశేషం. సినిమాలో అమాయకంగా ఎడమ చేతితో రాసే చెల్లి పాత్రలో యామిని చాలా నేచురల్ గా నటించి అందరికి గుర్తుండిపోయింది.
‘జయం’ సినిమా తర్వాత చాలా సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికి యామిని.. పైచదువుల కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక జయం సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తికావడంతో.. యామిని శ్వేత పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. జయం సినిమా చూసిన ప్రతిసారి హీరోయిన్ సదా చెల్లిగా నటించిన అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తోంది..? ఎక్కడుంది అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. యామిని విదేశాలలో మాస్టర్స్ కంప్లీట్ చేశాక.. పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇక ఇప్పుడు యామిని శ్వేతను చూస్తే.. ఖచ్చితంగా షాక్ అవుతారు. పెళ్లి చేసుకొని ఓ పాపకు తల్లిగా వివాహ బంధాన్ని ఆస్వాదిస్తోంది. కానీ.. సినిమాల్లోకి వచ్చి ఉంటే బాగుండేదని ఆమెను చూసినవారంతా అంటున్నారు. చిన్నతనంలో పలు సీరియల్స్ లో మెరిసిన యామిని.. పెద్దయ్యాక హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చినా చేయలేదట. ఈ విషయాన్ని స్వయంగా యామిని తల్లి నటి జయలక్ష్మి చెప్పారు. “మా కూతురిని చైల్డ్ ఆర్టిస్ట్ గానే చూడాలనుకున్నాం.. చూశాం. ఆ తర్వాత పెద్దయ్యాక టెన్త్ క్లాస్, నచ్చావులే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ అప్పుడు చదువుకుంటుందని ఒప్పుకోలేదు” అని జయలక్ష్మి తెలిపారు.
ఇదిలా ఉండగా.. యామిని సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటోంది. ముఖ్యంగా తన ఫ్యామిలీ ఫోటోలు, తన కూతురితో చేసే వీడియోలు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంటుంది. అయితే.. సోషల్ మీడియాలో యామినిని చూసినవారు.. ఇప్పటికైనా సినిమాల్లోకి రావచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం యామినికి సంబంధించి జయం సినిమా ఫోటోలతో పాటు కొత్తగా సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరి యామిని శ్వేత గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.