సూపర్ స్టార్ ఈ పదం తెలుగునాట ఒక ప్రభంజనం. సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆయన వారసుడిగా ఆ టైటిల్ కి న్యాయం చేసిన హీరో మహేష్ బాబు. ఈ జనరేషన్ కి మహేష్ బాబే సూపర్ స్టార్.. ఆ తర్వాత జనరేషన్ కి గౌతమ్ కృష్ణ సూపర్ స్టార్ అనే అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి మరో సూపర్ స్టార్ రాబోతున్నాడు. అతను మరెవరో కాదు. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని. జయకృష్ణ చదువు నిమిత్తం విదేశాల్లో ఉంటున్నాడు. అందుకే కృష్ణ ఆఖరి చూపుకి రాలేకపోయాడు. అయితే అంత్యక్రియలు ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి చిన్న కర్మలో పాల్గొని కృష్ణకి నివాళులు అర్పించాడు. ఈ సందర్భంగా ఫోటోలు కూడా దిగాడు.
ఈ ఫోటోలే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ తో దిగిన ఫోటో మాత్రం బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ ఫోటోలో బాబాయ్, అబ్బాయ్ ఇద్దరూ ఒకే రంగు చొక్కా వేసుకుని.. ఫోటో దిగారు. మహేష్ ని, జయకృష్ణని పక్కపక్కన చూస్తుంటే ఇద్దరూ ఒకేలా కనబడుతున్నారు. జయకృష్ణ కటౌట్ చూస్తుంటే.. ఘట్టమనేని కాంపౌండ్ నుంచి మరో సూపర్ స్టార్ రెడీ అవుతున్నట్లు ఉంది. ఆ హైటు, ఆ పర్సనాలిటీ చూస్తుంటే.. హీరోకి ఉండాల్సిన లక్షణాలు మాత్రమే కాదు, సూపర్ స్టార్ టైటిల్ కి ఉండాల్సిన అర్హతలు సంపాదించినట్టు ఉంది. ఫోటో చూసి ఫ్యూచర్ చెప్పడం అని కాదు కానీ.. జయకృష్ణ ఇన్స్టాగ్రామ్ ఖాతాలోకి వెళ్లి అతని టాలెంట్ చూస్తే నిజమే కాబోయే సూపర్ స్టార్ అని ఒప్పుకుంటారు.
హీరో అంటే అందం మాత్రమే కాదు.. హీరో అనే పేరుని నిలబెట్టుకునేందుకు ఎంత కష్టపడాలో అంతా కష్టపడాలి అనే విధంగా కష్టపడుతున్నాడు. గాల్లోకి 4, 5 అడుగుల ఎత్తుకి ఎగురుతూ స్టంట్స్ చేస్తున్నాడు. చూస్తుంటే ఈ అప్ కమింగ్ సూపర్ స్టార్.. మొదటి సినిమానే మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేస్తాడేమో అనిపిస్తుంది. ఈ వీడియోలు చూసి అభిమానులైతే ‘హైదరాబాదీ టైగర్ ష్రాఫ్’ అని బిరుదు కూడా ఇచ్చేశారు. మరి ఇన్ని క్వాలిటీస్ ఉంటే సూపర్ స్టార్ టైటిల్ కి సరిపోడా? ఫోటో ఫ్రేమ్ లో బాబాయ్, అబ్బాయ్ లని పక్కపక్కన చూస్తుంటే.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా పడితే ఉంటది నా సామిరంగ అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
జయకృష్ణ ల్యాండింగ్ అయిపోతే.. ఆ తర్వాత ఎలాగూ గౌతమ్ కృష్ణ జాయిన్ అవుతాడు. ఈ ముగ్గురూ కలిసి చేస్తే ఇక మల్టీ స్టారర్ కాదు, మల్టీ సూపర్ స్టారర్ ఫిల్మ్ అవుతుంది. దీంతో టాలీవుడ్ కి ముగ్గురు సూపర్ స్టార్లు దొరికినట్టు అవుతుంది. సోషల్ మీడియాలో జయకృష్ణ గురించే టాక్ నడుస్తోంది. మనకి మరో సూపర్ స్టార్ దొరికేసాడురోయ్ అని అనుకుంటున్నారు. రెండో సూపర్ స్టార్ గా జయకృష్ణ తన మొదటి సినిమాతో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అంటూ ఘట్టమనేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. హీరోగా కాకపోయినా మహేష్ బాబు సినిమాలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చినా చాలని అనుకుంటున్నారు. మరి దర్శకులు ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.