కాలం మారినకొద్దీ సినిమాలు చూసే అభిమానుల అభిరుచులు కూడా మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కథను ప్రధాన వస్తువుగా భావించి సినిమా హిట్టా ఫట్టా అని నిర్ణయించేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో సినిమాలో కథాకథనాలు రొటీన్ అయినా.. లాజిక్స్ మిస్ అయినా.. కామెడీ ఉంటే చాలని భావిస్తున్నారు. ఆ కోవలో వస్తున్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతుండటం విశేషం. అలాంటి లాజిక్ కథాకథనాలతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘జాతిరత్నాలు’.
టాలెంటెడ్ యువహీరో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా ప్రధానపాత్రలలో ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు అనుదీప్. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జోగిపేట శ్రీకాంత్ గా నటించి కడుపుబ్బా నవ్వించాడు నవీన్. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన నవీన్.. రెండో సినిమాగా ‘జాతిరత్నాలు’ చేసి మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సినిమాతో నవీన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గతేడాది మార్చి 11న జాతిరత్నాలు మూవీ.. తాజాగా విడుదలై ఏడాది పూర్తవడంతో చిత్రయూనిట్ సినిమా విశేషాలను మరోసారి గుర్తుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ.. నవీన్ ఓ వీడియో షేర్ చేశాడు. “జాతి రత్నాలు సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ఈ మూవీ విడుదలయ్యే సమయానికి వ్యాక్సినేషన్ ప్రారంభం కాలేదు. కరోనా కారణంగా అప్పటికే చాలా వరకు థియేటర్లన్నీ మూతపడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో మా సినిమా విడుదలైంది. ఆ సమయంలో ప్రేక్షకులు మాపై చూపించిన ప్రేమాభిమానాలు మర్చిపోలేను. అందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
మీరు నాపై చూపిస్తున్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి కష్టపడి పనిచేస్తా.. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక్కడివే ఎలా రా.. ఇండస్ట్రీలో అంటూ మా నాన్న నాతో చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోను. కానీ ఈరోజు మీ అందర్నీ చూస్తుంటే నేను ఒంటరినని అనుకోవడం లేదు. తెలుగు ప్రేక్షకులంతా మనతో ఉన్నారు అనే ధైర్యం ఉంది. నిరాశకు గురైనప్పుడు మా సినిమా తమలో ఆనందాన్ని నింపిందని ప్రేక్షకులు చెబుతుంటారు. మా సినిమా మరింతగా మీ లైఫ్ లో నవ్వులు పూయించాలని కోరుతున్నాను” అంటూ నవీన్ పోలిశెట్టి తన ఆనందాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం నవీన్ ‘అనగనగా ఒకరాజు’ అనే సినిమా చేస్తున్నాడు. మరి జాతిరత్నాలు మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.