గ్లామర్ ప్రపంచంలో దేవకన్యలను కూడా మరిపించేలా అందంతో మాయ చేస్తుంటారు హీరోయిన్స్. అలాంటి వారిలో అతిలోక సుందరిగా పేరొందిన దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఒకరు. తన అందచందాలతో మాయ చేయడంలో తానేమి మినహాయింపు కాదని నిరూపిస్తోంది జాన్వీ. చిన్నప్పటి నుండి ముంబైలో పుట్టి పెరిగిన ఈ భామ.. బాలీవుడ్ కల్చర్ ని బాగా ఒంట బట్టించుకుంది. అందుకే ఏమాత్రం మొహమాటం లేకుండా టాప్ టు బాటమ్ తన అందాలతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. పట్టుమని పాతికేళ్ళు నిండకముందే ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన జాన్వీ.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది.
ఇక సినీ నటిగా ఎలాంటి పేరు సంపాదించుకుంది అనే విషయం పక్కన పెడితే.. గ్లామర్ బ్యూటీగా మాత్రం ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ తో పాటు సినిమాలకు సంబంధించి అప్ డేట్స్.. కొత్త కొత్త ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఈ క్రమంలో జాన్వీకి సంబంధించి కొన్ని లేటెస్ట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. నారింజ రంగు డ్రెస్ లో జాన్వీ.. తన యవ్వనాలన్నీ కెమెరా ముందు పరిచేసింది. రీసెంట్ గా ఓ మోడలింగ్ ఈవెంట్ లో పాల్గొన్న జాన్వీ.. అభిమానుల మతులుపోయే విధంగా ర్యాంప్ వాక్ చేస్తూ సర్ప్రైజ్ చేసింది.
తాజాగా జాన్వీకి సంబంధించి ర్యాంప్ వాక్ వీడియోతో పాటు ఫోటోలు ఫాలోయర్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫోటోలలో జాన్వీ అందాలను చూస్తూ ఫ్యాన్స్, నెటిజన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా.. ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన జాన్వీ.. ఒక్క సాలిడ్ హిట్ కూడా నమోదు చేయలేకపోయింది. ప్రస్తుతం బవాల్, మిస్టర్ & మిసెస్ మహి సినిమాలు చేస్తోంది. మరోవైపు తెలుగులో కూడా స్టార్ హీరో సరసన డెబ్యూ చేయనుందని టాక్ నడుస్తుంది. ఇక జాన్వీకి ఇన్ స్టాగ్రామ్ లో రెండు కోట్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. వారందరిని దృష్టిలో పెట్టుకొని తాను హాట్ ఫోటోషూట్స్ చేస్తుంటానని, అలాగే ఆ వచ్చిన అమౌంట్ తోనే ఈఎంఐ బిల్స్ పే చేస్తానని చెప్పి ఇటీవలే షాకిచ్చింది. మరి ప్రెజెంట్ వైరల్ అవుతున్న జాన్వీ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
EXCLUSIVE Janhvi Kapoor looks Dazzling in a Neon look as a showstopper for acclaimed Designer Amitaggarwalofficial ‘s show at the Blenders Pride Fashion Tour in Hyderabad.#JanhviKapoor #janhvikapoorhot pic.twitter.com/Z18mVN0srU
— Star Frames (@starframesoffl) November 28, 2022