ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. బాహుబలితో మొదలైన జోరు సాహో, పుష్ప, రాధేశ్యామ్, ట్రిపులార్ ఇలా కొనసాగుతూనే ఉంది. ఆ జాబితాలోకి ఇప్పుడు పూరీ జగన్నాథ్ నుంచి రెండు సినిమాలు రానున్నాయి. లైగర్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకన్నా విషయం తెలిసిందే. రెండో సినిమా కూడా పూరీ- విజయ్ దేవరకొండతోనే తీయనున్నట్లు ప్రకటించాడు. ఆ సినిమా టైటిల్ లాంఛ్ కూడా చాలా అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సినిమా పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా కావడం విశేషం.
ఇదీ చదవండి: మహేష్ బాబు చేయాల్సిన జనగణమన విజయ్ దేవరకొండ ఖాతాలోకి!
ఆ సినిమా నుంచి అభిమానులకు క్రేజీ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రౌడీ బాయ్ సరసన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అసలు లైగర్ సినిమాలోనే నటించాల్సిన జాన్వీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో పార్ట కాలేకపోయింది. విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని జాన్వీ గతంలోనే చెప్పింది. ఆ మధ్య జాన్వీని తెలుగులో ఇంట్రడ్యూస్ చేయనున్నారని కూడా టాక్ వచ్చింది. అయితే జనగణమన సినిమాతో అటు జాన్వీ కపూర్ కోరిక, ఇటు టాలీవుడ్ ఎంట్రీ కూడా ఒకేసారి జరిగిపోతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
#VijayDevarakonda makes dashing entry at #JanaGanaMana launch in mumbai@ArtistryBuzz @TheDeverakonda #vijaydeverkonda pic.twitter.com/wBaNEZJVIZ
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) March 29, 2022
ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాన్ ఇండియా సినిమా కావడంతో జాన్వీ కూడా ఓకే చెప్పిందని.. రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉండబోతోందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇంక సినిమా విషయానికి వస్తే.. జనగణమన సినిమా పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకోనుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో రూపుదిద్దుకోనుంది. ఇది ప్రధానంగా సైనిక నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.