అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్యూటీ జాన్వీ కపూర్. ఈమె గురించి సినీ ప్రేక్షకులకు, గ్లామర్ ప్రియులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ లో ఉండే జాన్వీ.. ఎప్పటికప్పుడు తన కెరీర్ తో పాటు, తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే.. హీరోయిన్ గా డెబ్యూ చేసి నాలుగేళ్లు అవుతోంది.. కానీ.. ఇప్పటివరకు కెరీర్ కి ప్లస్ అయ్యే బిగ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పటికి సరైన హిట్ కోసం ట్రై చేస్తోంది.
ఇక తాజాగా సోషల్ మీడియా గురించి, తన ఫాలోయర్స్ గురించి జాన్వీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ అప్ డేట్స్ చేయడం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందా? అనే ప్రశ్నకు చాలా వెరైటీగా స్పందించింది జాన్వీ. ఆమె మాట్లాడుతూ.. నటిగా నా సినిమాలకు, సోషల్ మీడియాకి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ సోషల్ మీడియానే అంత యూస్ అయితే.. నా ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ కలిసి సినిమా చూసినా.. మిలి మూవీ పెద్ద హిట్ అయ్యుండేది. నాకు ఇన్ స్టాగ్రామ్ లో సుమారు రెండు కోట్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. కానీ.. సినిమాలకు దీనికి ఎలాంటి సంబంధం ఉండదు.” అని చెప్పింది.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘సినీ నటులు సొసైటీపై ప్రభావం చూపుతారు అనేది నేను నమ్ముతాను. ఐతే.. వారికున్న స్టార్డమ్, ఇమేజ్ కారణంగా ఆ ప్రభావం అనేది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే.. ఇన్ స్టాగ్రామ్, సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది స్టార్డమ్ కి గుర్తు కాదు.. స్టార్డమ్ ని తీసుకురాలేవు. సోషల్ మీడియా ఇమేజ్ నా సినిమాలను ప్రేక్షకుల వద్దకు చేర్చడానికి మాత్రమే యూస్ అవుతోంది.’ అని చెప్పుకొచ్చింది జాన్వీ. ప్రస్తుతం ఈ బ్యూటీ మాటలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలే మాల్దీవ్స్ టూర్ కి వెళ్లిన జాన్వీ.. హాట్ హాట్ పిక్స్ తో రచ్చ లేపిన విషయం తెలిసిందే. చూడాలి మరి త్వరలో ఏదైనా హిట్ అందుకుంటుందేమో!