దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్. యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ పై దేశ వ్యాప్తంగా అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక.. ట్రిపుల్ ఆర్ విడుదలకి సమయం దగ్గర పడటంతో దర్శకుడు రాజమౌళి ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టాడు. ఇందులో భాగంగానే ఆర్.ఆర్.ఆర్ నుండి ప్రమోషనల్ వీడియో ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఇక తాజాగా ఆర్.ఆర్.ఆర్ నుండి జనని వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్.
మొత్తం మూడు నిమిషాల తొమ్మిది సెకన్ల నిడివితో ఈ సాంగ్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ లను అద్భుతంగా చూపించాడు జక్కన్న. ఇక అజయ్ దేవగణ్ కూడా వీరిద్దరితో సమానంగా హైలెట్ అయ్యాడు. “నేను అంటే నా పోరాటం. నాలో సగం నువ్వు” అని అజయ్ దేవగణ్ శ్రియతో చెప్పిన డైలాగ్ ఈపాటలో హైలెట్ అని చెప్పుకోవచ్చు.
ఇక జనని సాంగ్ లో తారక్, చరణ్ ఎక్స్ ప్రెషన్స్ హైలెట్ గా నిలిచాయి. కీరవాణి అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. జాతీయ భావాన్ని, దేశభక్తిని రగిలించే విధంగా, ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టె రీతిలో ఈ పాటని తెరక్కించడం విశేషం. ఆర్.ఆర్. ఆర్ వచ్చే ఏడాది 7వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే. మరి.. జనని పాటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.