బ్రిటిష్ నవలా రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన జేమ్స్‌బాండ్ పాత్ర సాహిత్య ప్రపంచంలోనే పెను సంచలనం మారింది. ఒక నవల లోని పాత్ర వెండితెరపై ఆవిష్కరించడం.. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానించడం నిజంగా అద్భుతమైన విషయం. బాండ్ తీరుతెన్నులు, అందచందాలు, తెలివితేటలు, పదునైన చూపులతో ఆకట్టుకుంటూ 50 ఏళ్లుగా సినీ ప్రియులకు ఫేవరేట్‌గా మారిపోయాడు.
ఇక జేమ్స్ బాండ్ చిత్రాలు అంటే ముఖ్యంగా బైక్, కారు చేజింగ్ సీన్లే ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు జేమ్స్ బాండ్ వాడే కారు విషయానికి వస్తే.. అందులో రక రకాల ప్రత్యేకతలు ఉంటాయి. బాండ్ సినిమాల్లో ఎంఐ6 ఏజెంట్ ఉపయోగించే కార్లలను సైతం ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. అలాంటి స్పెషల్ కారుని సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు సిద్ధంగా ఉంది. జేమ్స్‌బాండ్ సినిమాల్లో కనిపించే కార్లన్నీ ఆస్టన్ మార్టిన్ కంపెనీ నుంచే వస్తాయి. ఇక విడుదలకు సిద్ధమవుతున్న ‘నో టైం టు డై’ చిత్రంలో కూడా జేమ్స్‌బాండ్ కోసం ఒక ప్రత్యేకమైన కారును సిద్ధం చేశారు. దీన్ని డీబీ 5 జూనియర్ అని పిలుస్తోందా కంపెనీ. ఎలక్ట్రిక్ వాహనంగా సిద్ధమైన ఈ కారును ఒక్కసారి చార్జ్ చేస్తే 80 మైళ్లు ప్రయాణం చేసేయొచ్చు.
ఈ కారును అమ్మకానికి పెట్టింది ఆస్టన్ మార్టిన్ కంపెనీ. ఈ కారు ధరని 90,000 డాలర్లుగా నిర్ణయించింది. ఈ కారు కావాల్సిన వారు ఆస్టోన్ మార్టిన్ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్టోన్ మార్టిన్ సంస్థ కేవలం 125 కార్లను మాత్రమే తయారు చేసింది. వీటిని ఆస్టోన్ మార్టిన్ మెంబర్‌షిప్ ఉన్న వారికే కేటాయించనుంది. ట్విస్ట్ ఏంటంటే.. కారును కొనుగోలు చేసినా కూడా దీనిలో రోడ్డుపై షికార్లు చేయడం కుదరదు. ఎందుకంటే దీనికి అనుమతులు లేవు. జేమ్స్‌బాండ్ స్పెషల్ ఎడిషన్ డీబీ 5 జూనియర్‌లో డిజిటల్ నంబర్ ప్లేట్‌ను అమర్చారు.
ఇందులో నంబర్లు ఆటోమేటిక్‌గా మారిపోతుంటాయి, అంతేకాదు స్విచ్చ్ నొక్కితే చాలు హెడ్‌లైట్ల స్థానంలో గన్స్ ప్రత్యక్షం అవుతాయి. స్మోక్ స్క్రీన్, హిడ్డెన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో, రేస్‌ట్రాక్‌లపై నడపడానికి అనుమతులు ఉన్నాయి. సెలబ్రిటీలు, బిజినెస్ బ్యాగ్నెట్‌లు తమ గ్యారేజీలో అదనపు ఆకర్షణగా ఈ కార్లను ఉంచుకునేందుకు ఇష్టపడతారు.
Introducing the DB5 Junior NO TIME TO DIE Edition.#AstonMartin #LicenceToThrill #NoTimeToDie
— Aston Martin (@astonmartin) September 21, 2021