ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులను కూడా రాబడుతున్నాయి సౌత్ ఇండియన్ సినిమాలు. ఎన్నో హృద్యమైన జీవిత కథలను, నిజజీవిత సంఘటనలను వెలుగులోకి తీసుకొస్తూ సినిమాలు రూపొందిస్తున్నారు ఇప్పుడున్న దర్శకనిర్మాతలు. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే 12వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో విమర్శకుల ప్రశంసలు పొందిన జై భీమ్, నాంది సినిమాలు ఉత్తమ కేటగిరిలలో అవార్డుల అందుకున్నాయి.
ఇది చదవండి: విశ్వక్ సేన్‌కు మద్దతుగా నిలిచిన రాహుల్ రామక్రిష్ణ
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘జై భీమ్’ చిత్రం ఇదివరకే పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. కే. మణికందన్, లిజొమోల్ జోస్ కీలకపాత్రల్లో నటించగా.. రావు రమేశ్, రజిషా విజయన్, ప్రకాశ్ రాజ్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సూర్య-జ్యోతిక నిర్మించగా.. టిజె జ్ఞానవేల్ తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకొని రికార్డులు సృష్టించింది.
నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో 3 అవార్డులు అందుకున్న జై భీమ్.. ఆస్కార్ అవార్డులకు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో నామినేట్ అయింది. ఇప్పుడు 12వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటుడు కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ సహాయ నటుడుగా మణికందన్ కు అవార్డు దక్కింది.
#JaiBhim wins the Best Film & Best Supporting Actor awards at the #DadaSahebPhalkeFilmFestival
Thank you @dadasahebfest for the honour!
Congratulations #Manikandan on winning the Best Supporting actor
➡️https://t.co/8pwZaoeO17@Suriya_offl #Jyotika @tjgnan @rajsekarpandian
— 2D Entertainment (@2D_ENTPVTLTD) May 3, 2022
ఇక ఇదే ఫిలిం ఫెస్టివల్ లో తెలుగు ‘నాంది’ సినిమా కూడా సత్తా చాటింది. ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ కేటగిరిలో దర్శకుడు విజయ్ కనకమేడల అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. మరి ఉత్తమ కేటగిరిల్లో అవార్డులు అందుకున్న జై భీమ్, నాంది చిత్రాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
This is the proud moment for me and my Naandhi team about my Darling @vijaykkrishna receiving the Dadasaheb Phalke Film Festival 2022 Award as the best Debut Director. In this joy, the responsibility of all our friends is further increased more.. @allarinaresh @varusarath5 pic.twitter.com/zd7rxxEKoq
— Brahma Kadali (@brahmakadali) May 1, 2022