హీరో సూర్య.. సినిమాలు సెలక్ట్ చేసుకోవడంలో ఆయనే ప్రత్యేకతే వేరు. నేటివిటికీ తగ్గట్టు చిత్రాలు చేస్తూ ఉంటాడు. ఇక విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ తన రూటే సపరేటు అంటున్న హీరో సూర్య శుక్రవారం పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన చేయబోయే 39 వ చిత్ర ఫస్ట్ లుక్ తో మన ముందుకు వచ్చాడు. ఇక ఈ సారి జై భీమ్ అంటూ మరోసారి అందరిని ఆలోచింప చేస్తున్నాడు. చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్స్ లో సూర్య లాయర్ పాత్ర పోషించబోతున్నాడని స్పష్టంగా అర్ధమవుతుంది.
ఇక ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ వంటి భాషల్లో విడుదలవబోతోంది. ఇక అన్ని భాషల్లో కలిపి ఒకేసారి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమాకు డైరెక్టర్ టీఎస్. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక వైపు నల్ల కోటు, మరో వైపు పీడిత ప్రజలు ఇలా విభిన్న లూక్స్ తో మూవీ ఫస్ట్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడే హీరో సూర్య బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం, వారి న్యాయం కోసం పోరాడబోతున్నాడని మనకు అర్ధమవుతోంది. కొత్త కథాంశాలతో సినిమాలు చేయడంలో సూర్య ప్రత్యేకత వేరుగానే ఉంటుంది.
ఇక తాజాగా విడుదల చేసిన చిత్ర ఫస్ట్ లుక్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. దీంతో పాటు 40 వ సినిమాకు సంబందించిన ఎతరెక్కుమ్ తునింధవన్ అనే సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ మూవీకి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా కళానిధి మారన్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబందించిన సెకండ్ లుక్ సూర్య బర్త్ డే సందర్బంగా విడుదల చేశారు. ఇందులో కూడా సూర్య లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మరి ముఖ్యంగా జై భీమ్ సినిమా విషయానికొస్తే ఆయన సరికొత్తగా లాయర్ పాత్ర పాత్ర పోషిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.