కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య. ఈ మధ్యకాలంలో వరుసగా కొత్త తరహా కథలతో సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. గతేడాది సూర్య నటించిన ‘జైభీమ్’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా దేశంతో పాటుగా విదేశీ ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు పొందుతుంది.
‘జస్టిస్ చంద్రు’ అనే న్యాయవాది నిజ జీవితంలో ఆదివాసుల కోసం పోరాడిన నేపథ్యంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ఎన్నో రికార్డుల(ఆస్కార్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారానికి ఎంపికవడం, ప్రపంచంలోనే అత్యధిక IMDB రేటింగ్ నమోదు చేయడం)ను ఖాతాలో వేసుకున్న ‘జై భీమ్’.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక ‘9వ నోయిడా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ – 2022’కు జై భీమ్ నామినేట్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్.
Another feather in the cap✨#JaiBhim has been officially selected into the @noidafilmfest @Suriya_offl #Jyotika @tjgnan @rajsekarpandian @PrimeVideoIN pic.twitter.com/o6BrQGp1zA
— 2D Entertainment (@2D_ENTPVTLTD) January 19, 2022
ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. ఇక చిత్రంలో సూర్యతో పాటు మణికందన్, లిజోమోల్ జోస్, ప్రకాష్ రాజ్, రజిషా విజయన్ కీలక పాత్రల్లో నటించారు. సమాజంలోని సామాజిక అసమానతలు, కుల వివక్ష వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. అమాయక ప్రజలపై అన్యాయంగా కొందరు పోలీసులు చేసే దుశ్చర్యలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు దర్శకుడు టీజే జ్ఞానవేల్ చూపించాడు. మరి జై భీమ్ అరుదైన ఘనతలు సాధించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.