ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలతో లేడిస్ లో మంచి ఫ్యాన్ పాలోయింగ్ సంపాందించిన హీరో జగపతిబాబు. ఇక అప్పటి వరకు హీరోగా రాణించిన జగపతి బాబు.. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన “లెజెండ్” సినిమాతో విలన్ గా మారిన సంగతి తెలిసిందే.ఇక అప్పటి నుంచి జగపతిబాబుకి వరుసగా విలన్ గా ఆఫర్లు క్యూ కట్టాయి. మూడేళ్ళ క్రితం విడుదలైన “అరవింద సమేత వీర రాఘవ” చిత్రంలో కూడా జగపతిబాబు బసి రెడ్డి పాత్రలో విలన్ గా నటించి మెప్పించాడు. అయితే.., ఆ సినిమా సమయంలో యన్టీఆర్ తనతో అన్న మాటలను జగపతిబాబు తాజాగా బయటపెట్టారు.
ఇది కూడా చదవండి:
111 ఏళ్ల బామ్మ బర్త్‌డే సెలబ్రేషన్స్! మరణం ఈమెని మరిచిపోయిందా?
” అరవింద సమేత వీర రాఘవలో నాది ఎగ్రసివ్ క్యారెక్టర్. తారక్ ది చాలా కూల్ క్యారెక్టర్. దాంతో బసిరెడ్డి క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. దీంతో.. తారక్ నాకు కావాల్సినంత పనిష్మెంట్ కూడా ఇచ్చేశాడు. షూటింగ్ సమయంలో రోజూ ఫోన్ చేసి వాయించేవాడు. రక రకాలుగా తిట్టేవాడు. అది కూడా ప్రేమతో మాత్రమే. సినిమా విడుదల తర్వాత జరిగిన ఫంక్షన్ లో కూడా నా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చూసిన వారికి ముందు బసిరెడ్డి గుర్తుంటాడు. తర్వాతే నేను గుర్తుంటాను అన్నాడు. తను అలా అనడం చాలా పెద్ద స్టేట్‌మెంట్. ఆ తర్వాత నన్ను దూరం పెడుతున్నానని చెప్పారు. “బాబు మీకు.. నాకు అయిపోయింది. మీతో ఇక చేయలేను. మీరు తారక్ తోనే ఆడుకుంటున్నారు. ఇక నాలుగైదేళ్లు మీ ముఖం చూపించకండి” అని తారక్ అన్నారు. దానికి నేను ఓకే అన్నాను” అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. ఇక అరవింద సమేత విడుదలై ఎలాగో నాలుగేళ్లు పూర్తి అయ్యే సమయం దగ్గర పడుతుంది కాబట్టి.. మళ్ళీ తారక్, జగపతిబాబు కాంబో ప్రేక్షకుల ముందుకి వస్తుందేమో చూడాలి.