జగపతి బాబు గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల పాటు హీరోగా రాణంచాడు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ హీరో అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. విలన్, నాన్న, బాబాయ్ ఇలా వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. మరీ ముఖ్యంగా లెజండ్ సినిమా, అరవింద సమేతలో ఆయన పండించిన విలనీజం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం నెగిటివ్ రోల్స్‌తో పాటు.. పలు చిత్రాల్లో.. హీరో, హీరోయిన్‌కు అన్న, తండ్రి, ఇలా విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే టక్కున జగ్గుబాయ్ అని చెప్పవచ్చు.
ప్రస్తుం జగపతి బాబు.. ప్రభాస నటిస్తోన్న సలార్ చిత్రంలో, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తన 30వ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలు మాత్రమే కాక.. వెబ్ సిరీస్‌లలో కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఇక జగపతి బాబు నటించిన పరంపర వెబ్ సిరీస్ ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఇలా వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు జగపతి బాబు. దాంతో ప్రస్తుతం ఆయనకి సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం అవుతోంది. అదేంటంటే.. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న జగపతి బాబు.. తన రెమ్యూనరేషన్‌ని డబుల్ చేసినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి.
ఈ వార్తలపై జగపతి బాబు.. వెరైటీగా స్పందించాడు. తన ఇంట్లో సాయి బాబాకు పూజ చేసే వీడియోని షేర్ చేశాడు జగపతి బాబు. జనాలు నా దగ్గర ఉన్నాయనుకుంటున్న డబ్బులు నాకిచ్చేయ్.. ప్రతి ఒక్కరికి చెప్పలేక చస్తున్నాను అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని పోస్ట్ చేసి.. తన రెమ్యూనరేషన్ గురించి కామెంట్స్ చేసిన వారికి ఇన్‌డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్పాడు జగపతి బాబు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
Devuddaa…Andharu naa daggara undhanukuntuna dabbu naaku iccheyi…cheppaleka Chastuna. pic.twitter.com/mGpe9D4Ty5
— Jaggu Bhai (@IamJagguBhai) November 13, 2022