పుష్ప2 కోసం డైరెక్టర్ సుకుమార్ సూపర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రంగంలోకి జగపతిబాబును దింపాడు.
పుష్ప సినిమాతో క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సృష్టించిన బాక్సాఫీస్ సునామీ మనందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది పుష్ప2. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మెుత్తం ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, అల్లు అర్జున్ పిక్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? పుష్ప2లో జగపతిబాబు నటిస్తున్నాడు అన్న వార్త. ఈ విషయాన్ని స్వయంగా జగ్గూ భాయే చెప్పాడు.
జగపతిబాబు.. హీరోగా తన ప్రస్థానాన్ని మెుదలు పెట్టి, స్టైలిష్ విలన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. విలన్ క్యారెక్టర్లతో పాటుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా జగ్గూ భాయ్ నటిస్తున్నాడు. తాజాగా మరో క్రేజీ ఆఫర్ ను కొట్టేశాడు జగపతిబాబు. పుష్ప2లో ఓ సూపర్ క్యారెక్టర్ కు జగపతిబాబును తీసుకున్నాడు సుకుమార్. ఈ విషయాన్ని స్వయంగా జగపతిబాబే చెప్పాడు. సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీకా జాన్’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న జగపతిబాబు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చాడు.
“సుకుమార్ తో కలిసి పనిచేయడం నాకు ఎప్పుడూ ఎక్సైటింగ్ గా ఉంటుంది. పుష్ప2లో నా పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటుంది. నాకు ఇలాంటి పాత్రలు అంటేనే ఇష్టం. అదీకాక సుక్కు నాకు ఎప్పుడు మంచి క్యారెక్టర్లే ఇస్తాడు. అతడితో కలిసి వర్క్ చేయడానికి నేను ఎప్పుడూ రడీగానే ఉంటా” అంటూ చెప్పుకొచ్చాడు జగ్గూ భాయ్. ఇక బన్నీని తాను 20 సంవత్సరాల క్రితం ఓ జిమ్ లో చూశానని, అతడి హార్డ్ వర్క్ చూసి గొప్పవాడు అవుతాడని అనుకున్నట్లు జగపతిబాబు చెప్పాడు. ప్రస్తుతం జగ్గూ బాయ్ ఇతర భాషల్లో నటిస్తూ.. పుల్ బిజీగా ఉంటున్నాడు. మరి సుకుమార్ పుష్ప2లో జగపతిబాబుకు ఏ క్యారెక్టర్ ఇచ్చాడో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.